Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మ‌నీ.. ఎప్పుడు, ఫ్రీగా ఎలా చూడాలంటే..?

పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది.

Paris Olympics 2024 opening ceremony

Paris Olympics 2024 opening ceremony : పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఈ క్రీడ‌ల‌ను వీక్షించాల‌ని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వక్రీడలు అధికారిక ప్రారంభోత్సవం రేపు (శుక్ర‌వారం జూలై 26న‌) అట్టహాసంగా జ‌ర‌గ‌నుంది. పారిస్‌లోని సెన్ న‌దిపై ఈ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో స్టేడియంలో కాకుండా ఆరు బ‌య‌ట న‌దిలో ఆరంభోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని ఆటలు ప్రారంభమయ్యాయి.

జూలై 27 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు మొత్తం 17 రోజుల పాటు ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుక స్థానిక కాల‌మానం ప్ర‌కారం జూలై 26 శుక్ర‌వారం రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. అదే భార‌త కాల‌మానంలో అయితే.. రాత్రి 11 గంట‌ల‌కు ఆరంభం కానుంది. దాదాపు మూడు గంట‌ల పాటు ఆరంభ వేడుక‌లు కొన‌సాగ‌నున్నాయి. అథ్లెట్లు దాదాపు 100 ప‌డ‌వ‌ల్లో న‌దిలో ఐకానిక్ పారిస్ ల్యాండ్ మార్క్‌ల గుండా ప్ర‌యాణిస్తారు.

Suryakumar Yadav : శ్రీలంక‌తో టీ20 సిరీస్‌కు ముందు సూర్య‌కు రింకూ సింగ్ స్పెష‌ల్ రిక్వెస్ట్‌..

జార్డిన్ డెస్ ప్లాంటెస్ పక్కన ఉన్న ఆస్టర్లిట్జ్ వంతెన నుంచి వేడుక‌లు ప్రారంభం అవుతాయి. ఈ వేడుక నోట్రే డామ్, లౌవ్రే వంటి ల్యాండ్‌మార్క్‌ల గుండా పశ్చిమం వైపు 6 కి.మీ వరకు కొనసాగుతుంది. వేడుక జరగబోయే ట్రోకాడెరో ఎదురుగా పడవలు వస్తాయి.

ఎక్క‌డ చూడొచ్చు..
ఒలింపిక్స్ ఆరంభ వేడుక‌ల‌ను స్పోర్ట్స్ 18 నెట్‌వ‌ర్క్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయ‌నున్నారు. జియో సినిమా యాప్‌లోనూ చూడొచ్చు.

ట్రెండింగ్ వార్తలు