అలా జరిగిఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది : సీఎం చంద్రబాబు

ఇసుకలో 7వేల కోట్లు దోచుకున్నారు. సహజ సంపదలో 10వేల కోట్లు దోచుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఇక రుషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారు.

CM Chandrababu naidu

CM Chandrababu : 2019లో ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యుంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం మారినా దుర్మార్గులు రాకుంటే ఏపీలో ఇంత దారుణ పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణలో ప్రభుత్వం మారినా ఇలాంటి పరిస్థితి రాలేదు. కానీ, ఏపీలో ఐదేళ్లు దుర్మార్గపు పాలనతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ ఏరియా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. 46శాతం ఆదాయం వచ్చే ఏపీ జనాభా చూస్తే 56శాతం ఉంది. రాష్ట్ర విభజనతో ఫర్ క్యాపిటల్ ఇన్ కం ఏపీకి తగ్గింది. నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం కొనసాగించిందని చంద్రబాబు అన్నారు.

Also Read : కేసీఆర్‌ను బ‌ద‌నాం చేయాలనే కుట్రలను ఆపండి.. ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నాం : కేటీఆర్

2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పుడూ ఖర్చుపెట్టనంత స్థాయిలో 64వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ లో పెట్టాం. దాని ఫలితాలు వచ్చాయి. ఐదేళ్లలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నాలుగు సార్లు ఫస్ట్ ప్లేస్ లో వచ్చాం. పెట్టుబడులంటే చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. 16లక్షల కోట్లు ఎంఓయులు చేశామని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా రూ.446 కోట్లతో డయాఫ్రం వాల్ కట్టాం. కానీ, దానిని ఆగం చేశారు. రిపేర్ చేసినా గ్యారెంటీ లేదు. అందుకే రూ. 990 కోట్లతో న్యూ డయాఫ్రం వాల్ కట్టాలని రెకమెండ్ చేశాం. అందువల్ల పోలవరం ప్రాజెక్ట్ 2027-28 నాటికి పూర్తయ్యే పరిస్థితికి వచ్చిందని చంద్రబాబు అన్నారు. 2019లో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వచ్చిఉంటే.. 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. అమరావతి రాజధానిని పూర్తి చేసిఉంటే ఇప్పుడు రెండు నుంచి మూడు నాలుగు లక్షల కోట్లు ఆదాయం వచ్చేది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ రాజధాని అమరావతి అయ్యేది. దుర్మార్గులు నాశనం చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : ఇండియా కూటమిలో జగన్ చేరబోతున్నారన్న వార్తలపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ పాలకుల నిర్వాకం వల్ల పవర్ సెక్టార్ లో 1.29లక్షల కోట్లు బకాయిలు పడ్డామని చంద్రబాబు చెప్పారు. 600 కోట్ల రూపాయలు మన డబ్బులు విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం స్కీంలు ఉపయోగించుకోలేక పోయాం. చెత్త మీదకూడా పన్నులు వేశారు. 9లక్షల 74వేల కోట్లు అప్పైంది. ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి  ఉంది. తవ్వేకొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో 1 లక్షా 44 వేల తలసరి అప్పైంది. ప్రభుత్వం ఆస్తులనుకూడా కొదువ పెట్టారు. అప్పులన్నీ చేసి స్టేట్ డవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు. పిల్లలు కట్టిన ఫీజులు యూనివర్సిటీ డవలప్మెంట్ కోసం వాడుతాం. అయితే ఆ డబ్బులు కూడా వాడేశారు. తాగండి.. తాగించండి అన్నాడు. మద్యపాన నిషేధం అన్నాడు. ఆ డబ్బులు కూడా ఊడ్చేశాడంటూ జగన్ ప్రభుత్వం తీరుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మరోవైపు.. విశాఖలో ప్రభుత్వ పాలిటెక్నిక్, డెయిరీ, ఐటిఐ, పోలీస్ ట్రైనింగ్ సెంటర్, ఈఈ బంగ్లా, ఆర్ అండ్ బీ, రైతు బజార్ లు, సర్క్యూట్ హౌస్, సెరికల్చర్, సీతమ్మదార తహసీల్దార్ ఆఫీస్ లను తాకట్టుపెట్టి వైసీపీ హయాంలో రూ.1,940 కోట్లు రుణాలు తెచ్చారు. విశాఖలో మరో 40వేల కోట్ల దోపిడీ చేశారు. దానికి పరిపాలన రాజధాని అని పేరు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.

Also Read : CM Jagan : షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?

వైసీపీ హయాంలో ఖర్చులు ఆదాయం కంటే పెరిగాయి. 2019 నాటికి 3,75,295 కోట్లు అప్పు ఉండగా.. ఇప్పడు 9 కోట్ల 74 లక్షల కోట్లు అప్పు ఉంది. మనకు తెలిసిన అప్పులు ఇవి అని చంద్రబాబు అన్నారు. కోర్టు కేసులు కోసం రూ.3,400 కోట్లు ఫీజు చెల్లించారు. ఐదేళ్లలో 24,988 రిట్ కేసులు ఫైల్ చేశారని చంద్రబాబు తెలిపారు. మనకు వచ్చే మొత్తం ఆదాయం 2లక్షల 39వేల కోట్లు. మొత్తం ఖర్చు 2లక్షల50వేల కోట్లు. డెఫ్ షీట్ 11వేల కోట్లు ఉందని చంద్రబాబు అన్నారు. ఇక.. ఇసుకలో 7వేల కోట్లు దోచుకున్నారు. సహజ సంపదలో 10వేల కోట్లు దోచుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఇక రుషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 500 కోట్లు టూరిజంకోసం ఖర్చు పెట్టిఉంటే వేల కోట్లు ఆదాయం వచ్చేదని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలి? మీ విలాసాల కోసం ఇష్టం వచ్చినట్లు ఖర్చుచేసే హక్కు ఎవరిచ్చారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం పెత్తందార్లం కాదు అంటూ చంద్రబాబు గత వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర క్యాబినెట్ లో ఫస్ట్ టైం ఏపీకోసం ఒక పేరా పెట్టారు. రాజధాని నిర్మాణంకోసం స్పెషల్ ఫైనాషియల్ సపోర్ట్ 1500 కోట్లు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం మీకోసం ఉంది. ఆదాయం పెంచుతాం. ఆ ఆదాయాన్ని మీకోసమే ఖర్చు చేస్తామని చంద్రబాబు ఏపీ ప్రజలకు అసెంబ్లీ వేదికగా తెలిపారు. మనమంతా ఆలోచించాలి.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. ప్రజలకోసం అనునిత్యం పనిచేస్తామని చంద్రబాబు అన్నారు. 2019లో ఇదే ప్రభుత్వం వచ్చిఉంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం మారినా దుర్మార్గులు రాకుంటే ఏపీలో ఇంత దారుణ పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణలో ప్రభుత్వం మారినా ఇలాంటి పరిస్థితి రాలేదు. కానీ, మన రాష్ట్రంలో ఐదేళ్లు దుర్మార్గ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు అన్నారు. మళ్లీ రెండు నెలల్లో బడ్జెట్ తో వస్తామని చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు