Oxygen Shortage Khammam : ఖమ్మంలో ప్రైవేటు ఆస్ప్రత్రుల్లో ఆక్సిజన్ కొరత.. వైద్యుల్లో ఆందోళన

ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. దాదాపు 40 ప్రైవేటు ఆస్పత్రుల్లో 350 మందికిపైగా ఆక్సిజన్ ద్వారా చికిత్స పొందుతున్నారు.

Oxygen Shortage in Khammam : ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. దాదాపు 40 ప్రైవేటు ఆస్పత్రుల్లో 350 మందికిపైగా ఆక్సిజన్ ద్వారా చికిత్స పొందుతున్నారు. అయితే ఆక్సిజన్ కొరత కారణంగా 2 గంటల్లో ఆక్సిజన్ అందకపోతే రోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్, డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని హాస్పిటల్స్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.

ఆక్సిజన్ కొరతపై వెంటనే స్పందించాలని ఆస్పత్రి యాజమాన్యాల విజ్ఞప్తి చేస్తున్నాయి. ఖమ్మం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతపై జిల్లా కలెక్టర్ కర్ణన్ స్పందించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు ఆందోళన పడొద్దని సూచించారు.

ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ కొరత లేకుండా స్టాక్ తెప్పిస్తున్నామని కలెక్టర్ కర్ణన్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు