Rythu Bandhu : రైతుబంధు పంపిణీకి ఈసీ బ్రేక్, ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Rythu Bandhu : తెలంగాణలో రైతుబంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది. మే 13 పోలింగ్ తర్వాతే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మే 9 లోపు రైతుబంధు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ అభిప్రాయపడింది. దీనిపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ తేదీ వరకు రైతుబంధుకు సంబంధించిన నిధులను విడుదల చేయొద్దని, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయొద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిన్న మొన్న పలు రాజకీయ సభలు, ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 9వ తేదీలోపు కచ్చితంగా రైతుబంధుకు సంబంధించిన నిధులను లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేయడంతో.. ఈసీ సీరియస్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని ఈసీ అభిప్రాయపడింది. అంతేకాదు నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మే 13 పోలింగ్ తర్వాత యధావిధిగా రైతుబంధు నిధులను విడుదల చేయొచ్చని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి జనవరిలోనే రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే చాలా ఆలస్యమైంది. సరిగ్గా ఎన్నికలకు ముందు.. రైతుబంధు నిధులను విడుదల చేసినట్లు అయితే ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు అవుతుందని ఈసీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వెంటనే నిధుల విడుదలను ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది.

 

Also Read : నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడను, లొంగిపోయే ప్రసక్తి లేదు- కేసీఆర్

 

ట్రెండింగ్ వార్తలు