హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్లకూడదు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

Hyderabad traffic restrictions: తెలంగాణలో లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బేగంపేట నుంచి రాజ్ భవన్ మార్గంలో ఈరోజు రాత్రి, రేపు ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఈరోజు రాత్రి 7.50 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి రాజ్ భవన్‌కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 7.50 గంటల నుంచి 8.25 గంటల వరకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ వరకు వాహనాలను అనుమతించరు.

రేపు ఉదయం రాజ్ భవన్ నుంచి తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు పీఎం మోదీ వెళ్లనున్నారు. దీంతో రేపు ఉదయం 8.35 నుంచి 9.10 వరకు రాజ్ భవన్, మోనప్ప ఐలాండ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వరకు పెహికిల్స్ ని అనుమతించరు. ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనరులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Also Read: నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడను, లొంగిపోయే ప్రసక్తి లేదు- కేసీఆర్

వేములవాడకు ప్రధాని మోదీ
కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ క్షేత్రానికి రేపు(బుధవారం) ఉదయం ప్రధాని మోదీ వెళ్లనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

Also Read: వాళ్లందరిని నేనే కాంగ్రెస్‌లోకి పంపా, కోవర్టులుగా పని చేస్తున్నారు- మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు