Minister Amarnath: బాలయ్య బాబు కాదు… బాలయ్య తాత అనాలి: మంత్రి అమర్‌నాథ్

టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణను బాలయ్య బాబు అని కాకుండా.. బాలయ్య తాత అనాలని ఏపీ మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు 60 ఏళ్లుదాటిపోయాయని చెప్పారు. ఇవాళ అమర్‌నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బాలయ్య తాతను చూడడానికి ఎవరు వస్తారని అడిగారు.

Minister Amarnath: టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణను బాలయ్య బాబు అని కాకుండా.. బాలయ్య తాత అనాలని ఏపీ మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు 60 ఏళ్లుదాటిపోయాయని చెప్పారు. ఇవాళ అమర్‌నాథ్ విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బాలయ్య తాతను చూడడానికి ఎవరు వస్తారని అడిగారు.

జనాలు లేక చంద్రబాబు, బాలకృష్ణ రోడ్లపై మీటింగులు పెట్టుకుంటున్నారని, జనాలను చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ విమర్శలు చేయడం కోసమే ఉత్తరాంధ్ర చర్చ నిర్వహించినట్లు ఉన్నారని ఆయన అన్నారు. కోల్డ్ స్టోరేజ్, డార్క్ రూమ్ నాయకులు ఈ సమావేశం పెట్టారని అమర్‌నాథ్  విమర్శించారు.

చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతోనే వారు పనిచేస్తున్నారని ఆరోపించారు. తమ సర్కారుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు చాలా కాలం పాటు మంత్రిగా పనిచేశారని, ఆయన ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ కోసం ఎవరు జీవో ఇచ్చారని ఆయన నిలదీశారు.

టీడీపీ సర్కారు ఇచ్చిన తవ్వకాల జీవో రద్దు కోసం అప్పట్లో వైఎస్ జగన్ ఓ సభకు హాజరయ్యారని గుర్తు చేశారు. కాగా, ఇటీవల చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభల్లో తొక్కసలాటలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, బాలకృష్ణ తన కొత్త సినిమా విడుదల నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వారి సభలపై మంత్రి అమర్‌నాథ్ విమర్శలు గుప్పించారు.

Ram Temple darshan: అయోధ్యలో రామమందిర దర్శనానికి రాహుల్‌నూ ఆహ్వానిస్తాం: ఫడ్నవీస్

ట్రెండింగ్ వార్తలు