Guntur Stampede : ఇలా జరుగుతుందని ఊహించలేదు.. గుంటూరు తొక్కిసలాటపై చంద్రబాబు దిగ్భ్రాంతి

పేదలకు స్వచ్చంద సంస్థ అందించే సాయాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని చంద్రబాబు ప్రకటించారు. పేదల కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. ఇదో దురదృష్టకరమైన సంఘటనగా చంద్రబాబు అభివర్ణించారు.(Guntur Stampede)

Guntur Stampede : గుంటూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. స్వచ్చంద సంస్థ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే తాను అక్కడికి వెళ్లానని, అందులో మరో ఉద్దేశం లేదన్నారు చంద్రబాబు. తాను వెళ్లిపోయిన అనంతరం జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరం అన్నారు చంద్రబాబు.

పేదలకు స్వచ్చంద సంస్థ అందించే సాయాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని చంద్రబాబు ప్రకటించారు. పేదల కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. ఇదో దురదృష్టకరమైన సంఘటనగా చంద్రబాబు అభివర్ణించారు. ఈ ఘటనపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తుందని చెప్పారు మంత్రి విడదల రజిని. దీనిపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

Also Read..Stampede At Chandrababu Meeting : చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం అదేనా?

ఈ ఘటనతో టీడీపీ నేతలు సైతం షాక్ కి గురయ్యారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, ఇక ఎలాంటి దుర్ఘటన జరగదని టీడీపీ నేతలు ఎంతో ధీమాగా ఉన్నారు. అయితే తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోవడం టీడీపీ శ్రేణులను షాక్ కి గురి చేసింది. నిర్వాహకుల లోపం వల్లే ఇది జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కందుకూరు దుర్ఘటన తర్వాత.. పార్టీ నేతలను చంద్రబాబు అలర్ట్ చేశారు.

ఏ కార్యక్రమం చేసినా ఎలాంటి దుర్ఘటనలు జరక్కూడదని పదే పదే చెప్పారు. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జాగ్రత్తగా ఏర్పాట్లు చూడాలని, ఎలాంటి గందరగోళం జరక్కూడదని చంద్రబాబు హెచ్చరించారు. అయితే ఘోరం జరిగిపోయింది. ఎన్ఆర్ ఐ ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చంద్రన్న కానుకల పంపిణీలో తొక్కిసలాట జరిగింది. సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని భావనలో కొందరు పార్టీ నేతలు ఉన్నారు. కొందరు ఎన్ఆర్ఐలు పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేసి విషాదాలకు కారణం అవుతున్నారని మండిపడుతున్నారు.

Also Read..Kandukur Accident: చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురి మృతి.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు

గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందిస్తామని తెలిపింది. టీడీపీ తరపున రూ.5లక్షలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర మృతుల కుటుంబాలకు చెరో రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి లక్ష రూపాయల పరిహారం ఇస్తామన్నారు. డేగల ప్రభాకర్ రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.

మరోవైపు ప్రభుత్వం సైతం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇస్తామంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈసారి గుంటూరు వికాస్ నగర్ లో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. వారంతా గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.

వికాస్ నగర్ లో టీడీపీ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత చంద్రన్న కానుక పంపిణీ ప్రారంభించారు. కానుకలు తీసుకునేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. కానుకల కోసం మహిళలు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓ మహిళ స్పాట్ లోనే మరణించగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.

ట్రెండింగ్ వార్తలు