Sajjala Ramakrishna Reddy: వైసీపీ మ్యానిఫెస్టోపై సజ్జల కీలక కామెంట్స్

చంద్రబాబులా కేవలం తాయిలాలు ఇస్తామని తాము అసత్యాలు చెప్పబోమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

వైసీపీ మేనిఫెస్టోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మ్యానిఫెస్టో ఒక పవిత్ర గంధం లాంటిదని చెప్పారు. వచ్చే ఐదేళ్లు ఏం చేస్తామనేది వివరంగా చెప్పామని తెలిపారు. ఏం చేయాలన్నదానిపై తమకు స్పష్టత ఉందని చెప్పారు.

చంద్రబాబులా కేవలం తాయిలాలు ఇస్తామని తాము అసత్యాలు చెప్పబోమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019లో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామని తెలిపారు.తెలంగాణలోనూ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇంకా చేయలేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల మీదే కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారని అన్నారు.

చంద్రబాబు ఇప్పుడు పెన్షన్ 4 వేల రూపాయలు ఇస్తానని అంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దానితో లక్ష 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. ఎలా ఇస్తారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.చంద్రబాబుకు ఇచ్చిన హామీలు అమలు చేసే అలవాటు లేదు కాబట్టి ఏది పడితే అది హామీ ఇస్తున్నారని చెప్పారు.

ఎన్నికల పేరుతో వాలంటీర్ వ్యవస్థ ఆగేలా చేసింది చంద్రబాబేనని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లారని అన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలోనే 20 ఇళ్లు తిరిగి ప్రజలను అడిగితే తమ పాలన గురించి తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు రాళ్లతో కొట్టండని చెప్పిన రోజు సాయంత్రమే జగన్ మీద దాడి జరిగిందని అన్నారు.


ఎన్నికల వేళ.. మళ్లీ బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి

ట్రెండింగ్ వార్తలు