టీడీపీ మ్యానిఫెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడంలేదు.. ఎందుకంటే?: మంత్రి ధర్మాన 

Dharmana Prasada Rao: చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు సీఎం హోదాలో పనిచేశారని, ఆయన ఎన్నడూ మ్యానిపేస్టోను అమలు చేయలేదని..

టీడీపీ మ్యానిఫెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మ్యానిఫెస్టోను అమలుచేయలేదని, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించలేదని చెప్పారు.

చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు సీఎం హోదాలో పనిచేశారని, ఆయన ఎన్నడూ మ్యానిపేస్టోను అమలు చేయలేదని తెలిపారు. ఎన్నికల వేళ ఏదైనా ఒక గిమ్మిక్కు చేయాలనుకుంటారని, టీడీపీ సూపర్ సిక్స్‌ను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. సీఎం జగన్ మ్యానిఫెస్టోను 100 శాతం అమలు చేశారని తెలిపారు.

వైసీపీ మ్యానిఫెస్టోపై ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. మ్యానిపేస్టోపై వైసీపీ ఒక విశ్వాసం కలిగించిందని తెలిపారు. వైసీపీ అమలు చేసిన పథకాలు ఫీడ్ బ్యాక్ ప్రకారం కొనసాగిస్తున్నామని చెప్పారు.

పథకాల అమలులో తమకు నిబద్ధత ఉందని, అందుకే సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టామని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మ్యానిఫెస్టోను చంద్రబాబు నాయుడు చిత్తుకాగితంగా భావిస్తారని అన్నారు. చంద్రబాబు ఎన్నో ప్రకటిస్తారని, తర్వాత ఏదీ అమలు చేయరని చెప్పారు.

పదేళ్లలో దేశానికి మోదీ చేసింది ఈ ఒక్కటి మాత్రమే: వీహెచ్

ట్రెండింగ్ వార్తలు