వారిపై పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్లీ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారని కిషన్ రెడ్డి అన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా స్పీచ్‌ను మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారని చెప్పారు. పదేళ్లు అధికారంలోలేని కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా దేశంలో అధికారంలోకి రావాలని అనుకుంటోందని అన్నారు.

దేశం తమ కనుసన్నల్లోనే ఉండాలని సోనియా గాంధీ, రాహూల్ గాంధీ అనుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. రాహుల్ పాదయాత్ర ఎక్కడ చేస్తే అక్కడ నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారని విమర్శించారు. నరేంద్ర మోదీపై విమర్శలు చేయడానికి రాహుల్ గాంధీకి ఏ అంశలు దొరకడం లేదని చెప్పారు.

అందుకే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ పార్టీ గ్లోబల్స్ ప్రచారం మొదలు పెట్టిందని చెప్పారు. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని అన్నారు. ఇందుకు ఒక్క సాక్ష్యం చూపెట్టాలని రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్లీ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని అనడం పెద్ద అబద్ధమని చెప్పారు. సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి చేసిన ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి ఆఫీషల్ ట్విట్టర్ లో కాంగ్రెస్ పోస్ట్ చేసిందని అన్నారు. దీనిని బట్టి కాంగ్రెస్ ఎంత తొండి ఆట అడుతుందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పాలో అర్థం కావడం లేదని అన్నారు.

Sajjala Ramakrishna Reddy: వైసీపీ మ్యానిఫెస్టోపై సజ్జల కీలక కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు