CEO Sundar Pichai : గూగుల్‌లో సుందర్ పిచాయ్ 20ఏళ్ల ప్రస్థానం.. సాధారణ ఉద్యోగి నుంచి సీఈఓ స్థాయికి..!

ఏప్రిల్ 26, 2004 గూగుల్‌లో చేరిన మొదటిరోజు. అప్పటినుంచి టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. నా జుట్టులో కూడా.. కానీ, పనిలో పొందే థ్రిల్ మాత్రం ఇప్పటికీ అలానే ఉందని సీఈఓ సుందర్ పిచాయ్ తన 20ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

CEO Sundar Pichai celebrates 20 years at Google

CEO Sundar Pichai : ప్రముఖ ఆల్ఫాబెట్, గూగుల్ కంపెనీలో జాబ్ అంటే అంత ఈజీ కాదు. ఎంతోమంది టెకీలు గూగుల్ లో జాబ్ కొడితే చాలు లైఫ్ సెటిలి అయినట్టే భావిస్తారు. అలాంటి టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీకి సీఈఓ అయిన సుందర్ పిచాయ్ మన భారతీయుడు కావడం ఎంతో గర్వకారణం. మొదట్లో ఒక సాధారణ ఉద్యోగిలా చేరిన పిచాయ్.. ఆ కంపెనీకే సీఈఓ స్థాయికి ఎదిగి ఎందరో టెకీలకు ఆదర్శంగా నిలిచారు. తాజాగా సుందర్ పిచాయ్ గూగుల్‌లో తన 20ఏళ్ల ప్రస్థానం గురించి ఇన్‌స్టాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.

Read Also : Apple iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!

ఏప్రిల్ 26, 2004లో మొదలైన గూగుల్‌తో ప్రయాణం 20ఏళ్లు పూర్తిచేసుకున్నారు. రెండు దశాబ్దాల తిరుగులేని నిబద్ధత, 20ఏళ్ల విజయాలు, అద్భుతమైన వారసత్వం. 2004లో మెకిన్సే అండ్ కంపెనీలో పనిచేసిన తర్వాత పిచాయ్ ప్రయాణం ప్రారంభమైంది. ఎప్పటికప్పుడూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య కూడా రోజురోజుకీ గణనీయంగా పెరిగిపోతోంది. అయినప్పటికీ పిచాయ్‌కి తన పని పట్ల ఉన్న మక్కువ కొంచెం కూడా తగ్గలేదు. 2004 గూగుల్‌లో నా ప్రారంభ రోజు అంటూ ఆయన గుర్తుచేసుకున్నారు.

నా జుట్టు మారింది.. ఆ థ్రిల్ మారలేదు :
‘అప్పటి నుంచి టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. గూగుల్ కంపెనీ ఉత్పత్తులను ఉపయోగించే వారి సంఖ్య కూడా భారీగానే పెరిగింది. అందులో నా జుట్టు కూడా మారింది. కానీ, ఈ గూగుల్ కంపెనీకి సహకరించడం వల్ల నేను పొందిన థ్రిల్ మాత్రం స్థిరంగా ఉంది. రెండు దశాబ్దాలు గడిచినా, నేను ఇప్పటికీ అదృష్టవంతుడిగా భావిస్తున్నాను’ అంటూ పిచాయ్ పేర్కొన్నారు. కంపెనీలో చేరిన నాటి ఐడీ కార్డుతో పాటు 20వ నెంబర్ ఫొటోను షేర్ చేశారు.

ఇప్పుడు పిచాయ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా 150వేలకు పైగా లైక్స్ వచ్చాయి. పిచాయ్‌కు పనిపట్ల ఉన్న అంకితభావంపై ఆయన ఫాలోవర్లు, శ్రేయోభిలాషులు ఇన్‌‌స్టా వేదికగా స్పందిస్తున్నారు. పిచాయ్ జట్టు తగ్గింది. గూగుల్ ఆదాయం కూడా భారీగానే పెరిగిందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, పిచాయ్ మరెందరికో ఆదర్శం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

సీఈఓగా పిచాయ్‌దే కీలక పాత్ర.. :
గూగుల్‌లో పిచాయ్ ప్రొడక్టు మేనేజ్‌మెంట్ టీమ్ పర్యవేక్షించడమే కాకుండా క్రోమ్, క్రోమ్ ఓఎస్ వంటి ఆవిష్కరణలకు నాయకత్వం వహించారు. అప్పటి సీఈఓ లారీ పేజ్ ద్వారా ప్రొడక్ట్ చీఫ్‌గా నియమితులయ్యారు. అలా ఆయన ప్రయాణం కొనసాగింది. చివరికి 10 ఆగస్టు 2015న గూగుల్ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ ఇన్నోవేషన్‌లో కీలక పాత్రతో పాటు, గూగుల్ కంపెనీ అభివృద్ధిలో పిచాయ్ కీలక పాత్ర పోషించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్ వరకు ఆయన ప్రయాణం అద్భుతంగా సాగింది.

Read Also : WhatsApp iPhone Users : వాట్సాప్ ఐఫోన్ యూజర్లు ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు