Apple iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బ్లూ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ.55,999కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్‌బ్యాక్‌తో ధర రూ.53,199కి తగ్గుతుంది.

Apple iPhone 14 gets Rs 14k off on Flipkart
Apple iPhone 14 Sale : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా పవర్‌ఫుల్ ఫీచర్-ప్యాక్డ్ ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 128జీబీ ఐఫోన్ 14 గణనీయంగా ధర రూ.55,999కి తగ్గింపు అందిస్తోంది. 2022లో భారత మార్కెట్లో అసలు ఐఫోన్ లాంచ్ ధర రూ. 79,900తో పోలిస్తే.. రూ. 23,901 తగ్గింపు అందిస్తోంది.
ఈ కొత్త ఐఫోన్ 15 లాంచ్ తర్వాత ప్రస్తుత ఐఫోన్ 14 ధర రూ. 69వేలు ఉండగా దానిపై రూ. 13వేలు తగ్గింపు అందిస్తుంది. ఆపిల్ నుంచి లేటెస్ట్ ఆఫర్‌లో ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 14 అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఐఓఎస్ డివైజ్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే లేదా ఆండ్రాయిడ్ నుంచి మారాలనుకునే యూజర్లకు ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 2024లో కూడా ఈ ఐఫోన్ 14 డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బ్లూ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ.55,999కి అందిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్‌బ్యాక్‌తో ధర రూ.53,199కి తగ్గుతుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మీ ప్రస్తుత డివైజ్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా రూ. 41వేల వరకు ఆదా చేయవచ్చు.
ఐఫోన్ 13 ఫోన్‌పై ట్రేడింగ్ చేస్తే.. రూ. 26వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ట్రేడ్-ఇన్ ఆఫర్‌లు ఐఫోన్ 14 కొనుగోలు ధరను గణనీయంగా తగ్గిస్తాయి. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ చెక్అవుట్ సమయంలో నిర్దిష్ట క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో మరిన్ని తగ్గింపులు లేదా క్యాష్‌బ్యాక్‌లను కూడా పొందవచ్చు.
కొత్త ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 14ని ఎందుకు బెటర్? :
ఐఫోన్ 15 కొత్తది కావొచ్చు. కానీ, ఐఫోన్ 14 అంతకన్నా బెటర్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 14 అద్భుతమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కెమెరాలు, మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. డిస్కౌంట్ ధరలో ఈ ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు.