Somireddy Chandra Mohan Reddy : సీఎం జగన్ ప్రాణాలు కేంద్రం దగ్గర, ఆస్తులు తెలంగాణలో.. అందుకే ఈ భయం, మౌనం- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రాష్ట్రంలో జగన్ వస్తే వర్షాలు వరదలు వస్తాయని చెప్పారు. మరిప్పుడు ఏమైంది? రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే అర్హత జగన్ కి లేదు. Somireddy

Somireddy Chandra Mohan Reddy Slams CM Jagan (Photo : Facebook, Google)

Somireddy Chandra Mohan Reddy Slams CM Jagan : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. జగన్ ప్రాణాలు కేంద్రం దగ్గర, ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని.. అందుకే ఏపీకి అన్యాయం జరుగుతున్నా ప్రధాని మోదీని కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కానీ జగన్ ప్రశ్నించలేకపోతున్నారని సోమిరెడ్డి అన్నారు.

కడప నగరంలోని ద్వారకా నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీకి తీరని అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్ మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారాయన.

రాయలసీమ బిడ్డని అని చెప్పుకునే అర్హత జగన్ కి లేదు..
”బ్రిజేష్ ట్రిబ్యునల్ గత నిర్ణయాలపై పునః సమీక్షించాలని గెజిట్ పబ్లికేషన్ చేయడం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి. 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సమంగా వాటా ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్-2 అభ్యంతరం చేస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి మాట్లాడే పరిస్థితి లేదు.

Also Read : ప్రజలపై విద్యుత్ భారంవేసే పాపంలో ఈఆర్సీ కూడా భాగస్వామిగా మారింది

రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే అర్హత జగన్ కి లేదు. దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు పట్టిసీమ వల్ల కొంత నీరు వస్తోంది. కేంద్రం వద్ద మెడలు వంచిన జగన్.. రాయలసీమలో ఆరు జిల్లాలను తాకట్టు పెట్టారు. మీ పరిపాలనలో 100 తప్పులు చేశారు. ఇసుక, మద్యం, ఇరిగేషన్ పనుల్లో అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు.

జగన్ వస్తే వర్షాలు వరదలు అన్నారు.. మరి ఏమైంది?
మీ ప్రాణాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. మీ ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి. అందుకే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ తో మాట్లాడే దమ్ము జగన్ కు లేదు. లక్షల ఎకరాలకు నీరు లేక రైతులు, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో జగన్ వస్తే వర్షాలు వరదలు వస్తాయని చెప్పారు. మరిప్పుడు ఏమైంది? ప్రస్తుతం రాష్ట్రానికి జగన్ పీడ పట్టుకుంది.

Also Read : ఇదేమి చట్టం.. దేశంలో మరెక్కడైనా ఇలా ఉంటుందా? తల్లి వర్ధంతి కార్యక్రమానికి కూడా వెళ్లనివ్వరా..

నెల్లూరు పరిసర ప్రాంతాల్లో నీరు లేక 6 లక్షల ఎకరాలలో పంటలే వేయడం లేదు. మనకు వచ్చే 512 టీంఎంసీల నీళ్లు తగ్గించాలని చేస్తున్న నిర్ణయాలతో ఏకీభవిస్తే రైతుల ఘోష మీకు తగులుతుంది. మీ అవినీతి అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం, తెలంగాణ వద్ద తాకట్టు పెడితే భవిష్యత్తులో అనుభవించి తీరాల్సిందే” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు