Nara Bhuvaneshwari :ఇదేమి చట్టం.. దేశంలో మరెక్కడైనా ఇలా ఉంటుందా? తల్లి వర్ధంతి కార్యక్రమానికి కూడా వెళ్లనివ్వరా..

కొల్లు రవీంద్రను గృహనిర్భందం చేయడం పట్ల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విటర్ వేదికగా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు.

Chandrababu Arrest: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనివ్వరా? దేశంలో మరెక్కడైనా ఇలా ఉంటుందా? ఇదేమి చట్టం.. ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రభుత్వాన్ని భువనేశ్వరి ప్రశ్నించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మంగళవారంసైతం పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా నిర్భందించారు. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ బీసీ సాధికారిత కమిటీ మంగళవారం చలో రాజమహేంద్రవరం పేరుతో సైకిల్ యాత్రకు పిలుపునిచ్చింది.

Read Also : Balakrishna : అన్‌స్టాపబుల్‌లో ఇండైరెక్ట్‌గా బాబు గురించి బాలయ్య.. చంద్రుడు ఉదయిస్తాడు.. తప్పు చేయలేదని మీకు తెలుసు..

సోమవారం రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకొని రాత్రి పొద్దుపోయాక విడిచిపెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా రవీంద్రను పోలీసులు గృహనిర్భందం చేశారు. తన తల్లి వెంకట సౌభాగ్యవతి వర్ధంతి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని, బంధువులు, సన్నిహితులనూ ఇంట్లోకి అనుమతించలేదని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ఇంట్లోకి పాలుకూడా తీసుకెళ్లనివ్వలేదని, తన పీఏ, డ్రైవర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారని రవీంద్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Chandrababu : చంద్రబాబు క్వాష్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ

కొల్లు రవీంద్రను గృహనిర్భందం చేయడం పట్ల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విటర్ వేదికగా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు. తల్లి వర్ధంతి కార్యక్రమాలకుకూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇదేమి చట్టం.. ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో బాధించింది. వ్యవస్థల నిర్వీర్యం అని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అర్ధమవుతోందని అన్నారు. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నానని భువనేశ్వరి ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు