Visakhapatnam : ఆఫీసులో డిప్యూటీ కమిషనర్‌‌పై మట్టి పోసిన మహిళా అధికారి..ఉసురు తగులుతుందంటూ..శాపనార్థాలు

విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాదాలు దుమ్మెత్తి పోసుకునే వరకూ వెళ్లాయి. సీనియర్‌ ఆఫీసర్‌పైనే ఓ మహిళా అధికారి మట్టి పోయడం.. శాపనార్థాలు పెట్టడం ఇప్పుడు ఏపీ దేవాదాయ శాఖలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Visakha Endowments Department : విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాదాలు దుమ్మెత్తి పోసుకునే వరకూ వెళ్లాయి. సీనియర్‌ ఆఫీసర్‌పైనే ఓ మహిళా అధికారి మట్టి పోయడం.. శాపనార్థాలు పెట్టడం ఇప్పుడు ఏపీ దేవాదాయ శాఖలో హాట్‌ టాపిక్‌గా మారాయి. తనను వేధిస్తున్నారంటూ.. డిప్యూటీ కమిషనర్‌ పుష్ఫవర్ధన్‌పై మట్టిపోశారు అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి.

వేధిస్తున్నారని :-
తనను వేధించారని.. తన ఉసురు తగులుతుందంటూ శాంతి శాపనార్థాలు పెట్టారు. అయితే.. ఈ ఘటనపై ఎవరికి వారు వారి వాదనలు
వినిపిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టినందుకే ఇసుక పోశానని అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి చెబుతుంటే.. అసలు తమ మధ్య వివాదాలు కానీ, విబేధాలు కానీ లేవంటున్నారు డిప్యూటీ కమిషనర్‌ పుష్ఫవర్ధన్‌. సింహాచలం, మాన్సస్‌ భూములపై విచారణ చేస్తుండగా.. తనకు ఇలాంటి ఘటన జరగడంతో షాక్‌ అయ్యాయన్నారు డీసీ.

ఆర్ జేడీకి ఫిర్యాదు :-
డిప్యూటీ కమిషనర్‌ వేధింపులతో అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. తనను మానసికంగా తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉన్న వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకుని తనను డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌ సాధిస్తున్నారన్నారు. గతంలో కూడా ఆయనపై ఆర్‌జేడీకి ఫిర్యాదు చేశానన్నారు.

క్రిమినల్ కేసులు :-
మళ్లీ అతడిపై క్రిమినల్‌ కేసులు ఫైల్‌ చేస్తానని చెప్పారు. డిప్యూటీ కమిషనర్‌ తనను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నందునే ఆయనపై ఇసుక చల్లానన్నారు విశాఖ దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి. డీసీ పుష్పవర్ధన్‌ తన విధులను అడ్డుకోవడమేకాదు… మనిషిగా గుర్తించడం లేదన్నారు.

వివాదాలు, విబేధాలు లేవు :-
అయితే.. తమ మధ్య ఎలాంటి వివాదాలు కానీ.. విబేధాలు కానీ లేవంటున్నారు డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌. తాను విశాఖలో డ్యూటీకి వచ్చి నెలరోజులే అయిందని చెప్పారు. సడన్‌గా అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి వచ్చి ఇసుక పోసి.. నాశనం అయిపోతావ్ అని అనడంతో షాక్‌ అయ్యాయని చెప్పారు డీసీ. తాను ఎన్నో చోట్ల పని చేసానని.. కానీ ఎక్కడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదన్నారాయన. శాంతి ప్రవర్తనపై.. దేవాదాయ శాఖ కమీషనర్‌కు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు