పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్.. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడగానే కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆయనను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

ys jagan mohan reddy reached pulivendula and meet ycp cadre

YS Jagan – Pulivendula: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం కడప జిల్లా పులివెందుల చేరుకున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో వైసీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడగానే కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆయనను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీల కోసం కార్యకర్తలు, నాయకులు పోటీపడ్డారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు, భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.

ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నుంచి బయలుదేరి.. గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వచ్చారు. కడప విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో వారికి జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకున్నారు. 3 రోజుల రోజుల పాటు ఆయన పులివెందులలోనే ఉంటారు.

 

ట్రెండింగ్ వార్తలు