అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. గుర్తుంచుకోండి : అంబటి రాంబాబు హెచ్చరిక

క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించారు.

Ambati Rambabu : నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. గుర్తు పెట్టుకోండి.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ స్థలాన్ని సందర్శించిన అంబటి రాంబాబు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని రెండు గంటల్లో నేలమట్టం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సభలో నవ్వులు పూయించిన పవన్ కల్యాణ్..

క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించారు. టీడీపీ హయంలోనూ క్యాబినెట్ లో నిర్ణయించి కేటాయింపులు చేసుకుని పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు. కక్ష సాధింపుతోనే తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయ భవనాన్ని కూల్చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. గుర్తు ఉంచుకోవాలి. ప్రభుత్వ స్థలాన్ని 33 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాం. Crda నోటీసు ఇచ్చారు. 15 రోజులు సమయం ఉంటుంది. హై కోర్టుకి వెళ్లాం. ప్రోసెస్ ప్రకారమే చర్యలు తీసుకుంటాం అని నిన్నకోర్టులో చెప్పారు. ఇంతలోనే కూల్చేశారంటూ అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్ .. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

ప్రజావేదిక ప్రభుత్వానిది. ఇది మా పార్టీ కార్యాలయం. మా పార్టీ కార్యాలయం కట్టుకుంటే మీకు కడుపు మంట ఎందుకని అంబటి ప్రశ్నించారు. సూపర్ 6 అమలు ఇంకా మొదలు కాకుండానే విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇది ముమ్మాటికీ దుర్మార్గం. ఇతర ప్రాంతాల్లో మా నిర్మాణాలు అన్ని కూల్చెయ్యాలి అనుకుంటే మీ ఇష్టం.. అధికారం మీ చేతుల్లో ఉంది. మీరు కక్ష సాధింపు చేసినా.. ఏమీ చేసినా చట్ట ప్రకారం ముందుకెళ్తాం.  వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మళ్ళీ కోర్టుకు వెళ్తున్నామని అంబటి రాంబాబు చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు