త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. ఈ సీనియర్లు, యువ నేతలకు చోటు!

TG Cabinet Expansion Updates: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కోసం పోటీపడుతున్న నేతలు ఎవరు? ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?

తెలంగాణ మంత్రివర్గం విస్తరణ ఎప్పుడు ? మంత్రివర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉండటంతో అమాత్య యోగం కోసం ఆశావహులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది. కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియడంతో ఇక త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరందుకుంది? మరి ముఖ్యమంత్రి రేవంత్ జట్టులో కొత్తగా చేరేవారు ఎవరు?

కాంగ్రెస్‌లోకి చేరికలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ పెద్దలు… ఇతర పార్టీల్లోంచి వచ్చేవారికి సైతం మంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నారా? బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటున్న కాంగ్రెస్ నేతలు… ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు చేయందించి… అక్కున చేర్చుకున్నారు.

త్వరలో మరికొందరు చేరే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో… మంత్రివర్గ విస్తరణ లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కోసం పోటీపడుతున్న నేతలు ఎవరు? ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?

ఉమ్మడి ఖమ్మం జిల్లా
భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెవెన్యూ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయశాఖ మంత్రి
———————–
ఉమ్మడి వరంగల్ జిల్లా
కొండా సురేఖ
దేవాదాయశాఖ మంత్రి
దనసరి సీతక్క
మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి
———————–
ఉమ్మడి నల్లగొండ జిల్లా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఐటీ, సినిమాటోగ్రఫీ మంత్రి
ఉత్తమ్కుమార్రెడ్డి
ఇరిగేషన్ శాఖ మంత్రి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే
1. ఉమ్మడి జిల్లాలో కీలక నాయకుడిగా గుర్తింపు
2. కోమటిరెడ్డి కుటుంబంలో ఇప్పటికే ఒకరికి మంత్రి పదవి
3. చాన్స్ దక్కే అవకాశం లేకపోయినా, విస్తృతంగా ప్రయత్నాలు
——————————–
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి
శ్రీహరి ముదిరాజ్
మక్తల్ ఎమ్మెల్యే
ముదిరాజ్ సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం
ఎన్నికల సమయంలో ముదిరాజ్లకు మంత్రి పదవి ఇస్తామని రేవంత్ హామీ
——————————-
గ్రేటర్ హైదరాబాద్
మల్ రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
– గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు
– కాంగ్రెస్ సీనియర్ నేతగా మల్రెడ్డికి ఎక్కువ అవకాశాలు
– గ్రేటర్లో కాంగ్రెస్ బలోపేతానికి మంత్రివర్గంలో చోటుకల్పించాలనే ఆలోచన
———————-
ఉమ్మడి మెదక్
దామోదర రాజనర్సింహ
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
రోహిత్రావు
మెదక్ ఎమ్మెల్యే
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేయాల్సివుండటం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, బీజేపీ ఎంపీ రఘునందన్రావును ఢీకొనాల్సివుండటం
అత్యంత పిన్నవయస్కుడైన ఎమ్మెల్యే, రాజకీయంగా దూకుడు స్వభావం కలిసివచ్చే అవకాశం
రాష్ట్రంలోని కీలకసామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం, తండ్రి, సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావుకు ఉన్న ప్రాధాన్యం
—————————-
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే
సుదర్శన్రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే
మదన్మోహన్రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
—————–
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ ఎమ్మెల్యే
– రాజకీయాల్లో అత్యంత సీనియర్గా గుర్తింపు
– కాంగ్రెస్లో చేరితే మంత్రి పదవి ఇస్తామని హామీ పొందినట్లు ప్రచారం
– సీఎం రేవంత్రెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి కాంగ్రెస్లో చేర్చుకోవడం
———————-
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
సుదర్శన్రెడ్డి
బోధన్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రిగా అనుభవం
జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి ప్రాతినిధ్యం లేకపోవడం
కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉండటం, వయసు రీత్యా లాస్ట్ చాన్స్ అనే ఆలోచన
———————-
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
మదన్మోహన్ రావు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో పరిచయాలు
– విద్యావంతుడు, చురుకైన వ్యవహారశైలి, సామాజిక నేపథ్యం
– పార్టీలో కొత్తతరాన్ని ప్రోత్సహించాలనే ఆలోచన
———————–
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
ప్రేమ్సాగర్రావు
మంచిర్యాల ఎమ్మెల్యే
– ఉమ్మడి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికీ ప్రాతినిధ్యం లేకపోవడం
– కాంగ్రెస్ సీనియర్ నేత, జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించడం
—————————
ఉమ్మడి కరీంనగర్ జిల్లా
పొన్నం ప్రభాకర్
రవాణాశాఖ మంత్రి
శ్రీధర్బాబు
ఐటీ, పరిశ్రమల మంత్రి
——————-
ఆదిశ్రీనివాస్
ప్రభుత్వ విప్
– ఉమ్మడి జిల్లా నుంచి మరొకరిని మంత్రివర్గంలో తీసుకునే చాన్స్
– బీసీల్లో మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం

————————-
కౌన్సిల్ కోటాలో ముగ్గురు
1. కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు
ఉద్యమ నేతగా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా గుర్తింపు
ఉద్యమకారులకు పెద్దపీట వేశామని చెప్పుకునే వ్యూహం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సాన్నిహిత్యం, కేసీఆర్ను కట్టడికి అస్త్రం

2. అమీర్ అలీఖాన్, కాంగ్రెస్ మైనార్టీ నేత
మైనార్టీ కోటాలో ఎవరికీ దక్కని అవకాశం
కాంగ్రెస్ మైనార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా ఓటమి పాలవడం
హైదరాబాద్ నగరానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన

3. బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ
విద్యార్థి నేతగా ప్రతిపక్షం ఉండగా పోరాటానికి గుర్తింపు
ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఉండటం, యువత కోటా

Also Read: దటీజ్ పవన్ కల్యాణ్.. ఆఫీసు ముందే కుర్చీలు వేసుకుని మరీ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న డిప్యూటీ సీఎం

ట్రెండింగ్ వార్తలు