వైసీపీకి మరో బిగ్‌షాక్‌.. విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు.. మాజీ మంత్రి ఏం చేశారంటే?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ (గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్) నోటీసులు ఇచ్చింది.

Anakapalli District YSRCP Office : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని కూల్చేసిన రోజే మరో వైసీపీ కార్యాలయానికి నోటీసులు వెళ్లారు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ (గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్) నోటీసులు ఇచ్చింది. అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామ సర్వే నంబర్ 75/3లో ప్లాన్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేశారని నోటీసులలో మున్సిపల్ కార్పొరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Also Read : వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డికి బిగ్ షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

ప్లాన్ అప్రూవల్ కోసం 351 రోజుల క్రితం అప్లయ్ చేశారు.. కానీ, దరఖాస్తు పెండింగ్ లోనే ఉందని జోన్ 7 అసిస్టెంట్ సిటీ ప్లానర్ పేర్కొన్నారు. ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయని జీవీఎంసీ హెచ్చరించింది. అయితే, పట్టణ ప్రణాళిక అధికారులు వైసీపీ పార్టీ కార్యాలయంకి అంటించిన నోటీసులను మాజీ మంత్రి అమర్నాథ్ తీసేశారు. జీవీఎంసీ నోటీసులు ఇచ్చారు కాబట్టి దానిని భద్రపరుచుకునేందుకు గోడమీద నుండి తీశామని తెలిపారు.
గజాల్లో ఉంటే జీవీఎంసీ నుండి ప్లాన్ తీసుకోవాలి. కానీ, ఎకరాల్లో ఉంటే వుడా నుండి ప్లాన్ తీసుకొని జీవీఎంసీకి ప్లాన్ అప్లేయ్ చేయ్యాలి.. మేము అదే చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Also Read : అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. గుర్తుంచుకోండి : అంబటి రాంబాబు హెచ్చరిక

 

ట్రెండింగ్ వార్తలు