CM Jagan : దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

చంద్రబాబు పరిపాలనలో జన్మభూమి కమిటీలతో మొదలుపెడితే అమరావతి భూముల వరకు స్కాములే జరిగాయని జగన్ ఆరోపించారు. CM Jagan

CM Jagan Allegations On Chandrababu Naidu

CM Jagan Allegations On Chandrababu : ఛాన్స్ చిక్కితే చాలు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు ఏపీ సీఎం జగన్. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. గజదొంగ అంటూ చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.. ఇదీ చంద్రబాబు పాలనలో జరిగింది అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.

అన్నీ స్కామ్ లే..
చంద్రబాబు పరిపాలనలో జన్మభూమి కమిటీలతో మొదలుపెడితే అమరావతి భూముల వరకు స్కాములే జరిగాయని జగన్ ఆరోపించారు. ‘స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్, మద్యం కొనుగోళ్లలో కూడా ఎక్కడబడితే అక్కడ స్కామ్ చేసి దోచేయడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం. చంద్రబాబు హయాంలో ఇది తప్ప ఏమీ కనిపించ లేదు. కానీ ఈ నాలుగేళ్లలో రూ.2.38లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో మేము జమ చేశాము” అని జగన్ అన్నారు.

Also Read : అందుకే చంద్రబాబు తనకు ఆరోగ్యం బాగోలేదని అంటున్నారు: మంత్రి అంబటి

అప్పటికీ ఇప్పటికీ తేడా ముఖ్యమంత్రి మాత్రమే..
”గతానికి, ఇప్పటికి తేడా ముఖ్యమంత్రి మాత్రమే. అదే బడ్జెట్, అదే రాష్ట్రం. అప్పులు తక్కువే. వచ్చే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రజలే నా ధైర్యం. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే. మరి మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మరెప్పుడు ఎందుకు జరగలేదు? ఇప్పుడు మీ బిడ్డ పరిపాలనలో ఎందుకు జరుగుతోంది? అని ఆలోచన చేయండి.

దోచుకో, పంచుకో, తినుకో..
అప్పట్లో జరిగేది ఒక గజదొంగల ముఠా. ఒక చంద్రబాబు నాయుడు, వీరికి తోడు దత్తపుత్రుడు. వీళ్లంతా దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం.. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఇదీ. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాజధానిలో భూముల వరకు.. రాజధానిలో భూములతో మొదలు పెడితే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ వరకు.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రిడ్ దాకా.. ఫైబర్ గ్రిడ్ నుంచి మొదలుపెడితే చివరికి మద్యం కొనుగోళ్లలో కూడా.. ఎక్కడపడితే అక్కడ దోచేయడం, దోచుకున్నది పంచుకోవం.

గతంలో పేదలను అవమానించారు..
గతంలో పేదల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. గతంలో పేదవాడు ఎలా బతుకుతున్నాడు అన్న ఆలోచన చేసిన పరిస్థితి లేదు. పైగా, పేదవాడిని అహంకార ధోరణితో, పెత్తందారి మనస్తత్వంతో ఆ పేదవాడిని అవమానించిన రోజులు గతంలో ఉన్నాయి. రేపు పొద్దున జరగబోయే కురక్షేత్ర సంగ్రామంలో కౌరవలంతా ఏకమవుతారు. తోడేళ్లన్నీ ఏకమవుతాయి. కానీ మీ బిడ్డ గుండె ధైర్యం ఎవరో తెలుసా.. పైన దేవుడి దయ, మీ చల్లని దీవెనలు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి” అని జగన్ అన్నారు.

Also Read : సీఎం జగన్ ప్రాణాలు కేంద్రం దగ్గర, ఆస్తులు తెలంగాణలో.. అందుకే ఈ భయం, మౌనం- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.10వేలు..
కర్నూలు జిల్లా ఎమ్మినగూరులో జగనన్న చేదోడు పథకం డబ్బులను బటన్ నొక్కి విడుదల చేశారు సీఎం జగన్. దాదాపు 3.25 లక్షల మంది ఖాతాల్లోకి రూ.325 కోట్లు విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ల ఖాతాల్లో ప్రభుత్వం ఏంటా రూ.10వేల చొప్పున జమ చేస్తోంది. ఇప్పటివరకు నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.40వేలు జమ చేశారు. ఈ పథకం డబ్బులు అందకుంటే 1902కు ఫోన్ చేయాలని ప్రభుత్వం కోరింది.

ట్రెండింగ్ వార్తలు