Pawan Kalyan : ఒక్క చోట కూడా వైసీపీని గెలవనివ్వను, ఏపీని నెంబర్ 1 చేస్తా- పవన్ కల్యాణ్

Pawan Kalyan : ప్రభాస్ లాగా కష్టపడి సినిమాలు తీయలేదు. తండ్రి ముఖ్యమంత్రి అయితే పైరవీలు చేసి కోట్ల సంపాదించారు.

Pawan Kalyan (Photo : Twitter)

Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా పవన్ కల్యాణ్ చెలరేగిపోతున్నారు. వారాహి యాత్రలో జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని పవన్ ధజమెత్తారు. రాష్ట్రం బాగుండాలన్నా, జనం బాగుండాలన్నా.. జగన్ పోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ ను నెంబర్ వన్ గా చేసే బాధ్యత జనసేన తీసుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు. నాయకుడు బలంగా ఉంటే దేశం, రాష్ట్రం దశ దిశ మారుతుందన్నారు. వచ్చే పాతికేళ్లలో రాష్ట్రాభివృద్ధి కోసం గొడ్డు చాకిరీ చేస్తానని పవన్ అన్నారు. జనసేనకు అధికారం ఇస్తే రాష్ట్రాభివృద్ధి కోసం సమగ్రమైన ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు పవన్ కల్యాణ్.(Pawan Kalyan)

” రెండు చోట్ల నేను ఓడిపోయినప్పుడు నా గుండె కోసేసినట్లు అయ్యింది. నాకు బాధ అనిపించింది. అవినీతిపరులను గెలిపించారు. మంచి ఆశయంతో వచ్చిన వాడిని నన్ను ఎందుకు ఓడించారా అనిపించింది. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. వ్యవసాయానికి సంబంధం లేని వ్యక్తులు కూర్చుని బస్తాకు వంద రూపాయలు దోచుకుంటూ లాభాలు గడిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇన్ని డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? ప్రభాస్ లాగా కష్టపడి సినిమాలు తీయలేదు. తండ్రి ముఖ్యమంత్రి అయితే పైరవీలు చేసి కోట్ల సంపాదించారు.

Also Read..Chandrababu Naidu: ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా..? ఏపీలో వరుస దాడులపై చంద్రబాబు వీడియో రిలీజ్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో, కడప జిల్లా ఇడుపులపాయలో కూర్చుని దౌర్జన్యాలు దోపిడీలు చేసే వారు. 21 ఏళ్ల వయసులో పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎస్ఐని కొట్టారు. ముఖ్యమంత్రి తన సొంత డబ్బు ఇవ్వటం లేదు. మనందరి ఉమ్మడి శ్రమ అది. అంబేద్కర్ విగ్రహం పెడుతున్నామంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని కాదు. మేమే గెలవాలి అనేది ముఖ్య లక్ష్యం. నర్సాపురం పసలదేవి పంచాయితీలో వైసీపీకి 380 ఓట్లు వేస్తే జనసేనకి 1400 ఓట్లు వచ్చాయి. గెలిచిన వారికి సైతం నిధులు ఇవ్వడం లేదు. పోరాటమే శరణ్యం.(Pawan Kalyan)

గోదావరి జిల్లాలో పులివెందుల రౌడీ సంస్కృతి తీసుకొస్తే సహించం. గూండాలకు, నాటు బాంబులకి, వేట కొడవళ్లకు భయపడే వారు కాదు ఇక్కడి ప్రజలు. గోదావరికి విష సంస్కృతి తెస్తే తన్ని తగలేస్తాం. ఈ పెద్ద మనిషి రోడ్ల మీద తిరగడు. హెలికాప్టర్ లోనే తిరుగుతాడు. రోడ్ల మీద తిరుగు తెలుస్తుంది రోడ్ల పరిస్థితి. నరసాపురంకు ఒక డంపింగ్ యార్డు కూడా లేదు.

మోటార్లు అమ్ముకునే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. భూములకు రక్షణ లేకుండా పోయింది ఇక్కడ. ఫీల్డ్ లో ఐదుగురు పని చేస్తే పాతికమంది కార్మికులు పని చేస్తున్నారని చివరకు మనపై చెత్త పన్ను వేస్తున్నారు. ఇసుక ద్వారా రాష్ట్రంలో 50వేల మందికి ఉపాధి ఉండేది. ఇప్పుడు జగన్ బినామీ సంస్థ జేపీకి కట్టబెట్టారు. 14 ఉప కులాలైన మత్స్యకారులకు జీవో నెంబర్ 217 తెచ్చి అన్యాయం చేశారు.

Also Read..Anil Kumar Yadav : పోటీకి నేను రెడీ, నా గెలుపుని ఆపు చూద్దాం.. లోకేశ్ కు అనిల్ సవాల్

బటన్లు నొక్కితే అన్ని వచ్చేస్తాయి అనుకుంటున్నారు. ఆయన నొక్కని బటన్లు ఏంటో నేను చెబుతాను వినండి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వక పోవడం నువ్వు నొక్కని బటన్. నిరుద్యోగులకు ఉద్యోగాలు నువ్వు నొక్కని బటన్. ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులు నువ్వు నొక్కని బటన్. దళితులను చంపి హంతకులు బయట తిరుగుతున్నారే అదే నువ్వు నొక్కని బటన్. ఆక్వా రైతులకు గిట్టుబాటు లేకపోవటం నువ్వు నొక్కని బటన్. మూత పడిన ఎనిమిది వేల బడులు నువ్వు నొక్కని బటన్. ఆరోగ్యశ్రీ అందక మరణించిన మరణాలు నువ్వు నొక్కని బటన్. తాగునీరు అందని గ్రామాలు నువ్వు నొక్కని బటన్. హోలీలో మరణించిన గిరిజన మహిళల బతుకులు నువ్వు నొక్కని బటన్. అప్పుల ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్.

ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా ప్రకటిస్తా. రెండు జిల్లాల్లో ఉన్న 34 సీట్లలలో ఒక్కచోట కూడా వైసీపీని గెలవనివ్వను. జనం బాగుండాలంటే జగన్ పోవాలి” అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు