Kodali Nani : ఏపీలో రేషన్ షాపులు బంద్.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీలో రేషన్ షాపుల బంద్ పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. డీలర్ల బంద్ తో, రేషన్ షాపులు మూసివేసినంత మాత్రాన రేషన్ పంపిణీ...

Kodali Nani : ఏపీలో రేషన్ షాపుల బంద్ పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. డీలర్ల బంద్ తో, రేషన్ షాపులు మూసివేసినంత మాత్రాన రేషన్ పంపిణీ ఆగిపోదన్నారు. గతంలో రేషన్ షాపుల పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అని చెప్పారు. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం రేషన్ దుకాణం నుంచే జరిగేదని, ఇప్పుడు 11 వేల వాహనాలతో ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రభుత్వమే చేస్తోందని మంత్రి వివరించారు. రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం అంటే వాటిని పక్కనపెట్టి పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నేరుగా పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు.

డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. రేషన్ డీలర్ల బెదిరింపులకు ప్రభుత్వం భయపడేది లేదని తేల్చి చెప్పారు. రేషన్ దుకాణాలు కొనసాగాలంటే వారి భాష, పద్ధతి మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. లేదు మేము ఇలాగే ఉంటాం అంటే డీలర్లను బైపాస్ చేసి వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, దాన్ని ఎవరు అడ్డుకుందాం అనుకున్నా కుదరదని మంత్రి అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి యధావిధిగా రేషన్ పంపిణీ చేస్తామన్నారు.

Petrol : లీటర్ కేవలం రూ.1.50.. ఆ దేశంలో అగ్గిపెట్టె కంటే పెట్రోల్ చీప్

రేషన్ డీలర్ల సంఘం డిమాండ్లు…
* 2020 పీఎంజీకేవై కమీషన్‌ బకాయిలు తక్షణమే చెల్లించాలి.
* డీడీ డబ్బు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలి.
* డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలి.
* గతేడాది మార్చి 29 నుంచి నేటి వరకు ఏపీ పౌరసరఫరాల కార్సొరేషన్‌ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్‌ బకాయిలు చెల్లించాలి.

Five Drinks For Weight Loss : బరువు తగ్గడానికే కాదు..జీవక్రియకు ఉపయోపడే ఐదు అద్భుత పానీయాలు

గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే రూ.20 చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు చెల్లింపు చేయమని చెప్పడం సరికాదన్నారు. గోనె సంచులు తిరిగి ఇవ్వకుంటే ఎలాట్‌మెంట్‌ కట్‌ చేసి కేసులు పెడతామని హెచ్చరించడం తగదన్నారు. గోనె సంచులు ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10ని పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేస్తున్నారని డీలర్లు గుర్తు చేశారు. ఏపీలోనూ జీవో 10ని యథాతథంగా అమలు చేయాలని రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించే వరకు రేషన్‌ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల దగ్గర నిరసన కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌ రేషన్‌ డీలర్ల సంఘం పిలుపునిచ్చింది. గోడౌన్ల నుంచి రేషన్‌ షాపులకు వస్తున్న నవంబర్ నెల స్టాకును డీలర్లు దింపవద్దని సంఘం అధ్యక్షుడు వెంకట్రావు చెప్పారు. రేషన్ డీలర్ల బంద్ కు టీడీపీ మద్దతిచ్చింది. మరోవైపు రేషన్ దుకాణాల బంద్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ట్రెండింగ్ వార్తలు