Parvathipuam : రూ.90 లక్షలు ఇస్తే రూ.కోటి ఇస్తారు.. ఆఫర్ అదిరిపోయింది కదూ.. టెంప్ట్ అయ్యారో

Parvathipuram Police : పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని మోసపోవద్దని సూచిస్తూనే ఉన్నారు.

Parvathipuram Police (Photo: Google)

Parvathipuram Police : మోసగాళ్లు, కన్నింగ్ గాళ్లు ఎక్కువైపోయారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అమాయకులు, అత్యాశపరులే వారి టార్గెట్. ఎక్కువ డబ్బు ఆశ చూపించి అడ్డంగా దోచేస్తున్నారు. మోసపోయామని బాధితులు తెలుసుకునే లోపే డబ్బుతో ఉడాయిస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురంలో ఘరానా మోసం వెలుగుచూసింది. రూ.90లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే రూ.కోటి విలువైన రూ.2వేల నోట్లు ఇస్తామని ఓ ముఠా ఆశ చూపింది. కట్ చేస్తే.. డబ్బుతో ఉడాయించింది.

Also Read..Delhi Robbery : ఢిల్లీలో పట్టపగలే దోపిడీ .. కారులో ఉన్నవారికి గన్ చూపించి క్యాష్‌బ్యాగ్‌తో పరార్

భారీ మోసానికి పాల్పడ్డ ఇద్దరు కేటుగాళ్లను పార్వతీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.90లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ. కోటి విలువైన రూ.2వేల నోట్లు ఇస్తామని ఓ ముఠా ఆశ చూపింది. ఆ ఆఫర్ కు ఇద్దరు వ్యక్తులు ఫిదా అయిపోయారు. సూపర్ ఆఫర్ అని దాన్ని గుడ్డిగా నమ్మేశారు. అంతే.. రేగిడి ఆముదాలవలసకు చెందిన ఇద్దరు అప్పు తెచ్చి మరీ డబ్బు ఆ ముఠాకు ఇచ్చారు.

కట్ చేస్తే.. డబ్బు తీసుకున్న ముఠా సభ్యులు పరార్ అయ్యారు. దాంతో తాము మోసపోయాని తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు నిందితులు చక్రపాణి, నజీమ్ ను అరెస్ట్ చేయగా.. నగదుతో మరో ఇద్దరు పారిపోయారు.

Also Read..Video Viral: కర్ణాటకలో మరో దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే…

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మన అత్యాశే మోసగాళ్లకు వరంలా మారుతోంది. మన దురాశను వారు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని మోసపోవద్దని సూచిస్తూనే ఉన్నారు. అయినా, ఇంకా కొందరు వ్యక్తులు ఇలాంటి ముఠా చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. మన అత్యాశ, దురాశ.. కేటుగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది.

ట్రెండింగ్ వార్తలు