Pawan Kalyan: తనకు అందిన నోటీసులపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్

ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan

JanaSena: కేసులకు భయపడే వాడిని అయితే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. దీనిపై కృష్ణా జిల్లా పెడనలో ఆయన వారాహి యాత్రలో స్పందించారు.

ఎక్కడికి రమ్మన్నా వస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. తాను నోరు తెరిస్తే కేసులు.. నోటీసులు వచ్చేస్తున్నాయని చెప్పారు. జగన్ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే యువత టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటుందని అన్నారు. తమ సమావేశాలకు యువత భారీగా ఎందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.

అన్ని పార్టీలు కలిసి రావాలి..

పాలించేవ్యక్తి మనకు అండగా లేనప్పుడు ఆయనను కూల్చేయడానికి, తిరుగుబాటు చేయడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 2024 ఎన్నికల్లో ఆ పాలకుడిని తీసేద్దామని చెప్పారు. రాజకీయాల్లో జగన్ అనే వ్యక్తి అనర్హుడని, ఆయనను రాజకీయాల్లో లేకుండా చేద్దామని పిలుపునిచ్చారు.

మోపిదేవి సుబ్రమణ్యస్వామి ఆశీసులతో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని పవన్ కల్యాణ్ అన్నారు. 38 కేసులు ఉన్న వ్యక్తి పాలించేందుకు అనర్హుడని పవన్ అన్నారు. ఇక్కడ ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు నుంచి వెళ్లాలన్నా జనసైనికులు నమస్కారం పెట్టి వెళ్లాలనే నిబంధనలు ఉన్నాయంట అని వ్యాఖ్యానించారు. అవన్నీ తీసేద్దామని అన్నారు. ఇక్కడ అక్రమ మట్టి తవ్వకాలు చేస్తుంటే జనసైనికులు అడ్డుకున్నారని చెప్పారు. వైసీపీ నేతలు జాతీయ ఉపాధి పథకం నిధులు సగానికి పైగా దారి మళ్లించారని ఆరోపించారు.

ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తాం
ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. పదేళ్లు తన వెంట ఉంటే హైదరాబాద్ స్థాయిలో ఏపీని అభివృద్ధి చేస్తానని తెలిపారు. టీడీపీతో పాటు ఇంకెవరు ముందుకు వచ్చినా కలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనకు బీజేపీ అశీస్సులు ఉండాలని అనుకుంటున్నానని తెలిపారు. టీడీపీ-జనసేన మధ్య ఎలాంటి విబేధాలూ వద్దని, కలిసి ముందుకు వెళ్దామని చెప్పారు. వైసీపీ మహమ్మారి పోవాలంటే ఇరు పార్టీల వ్యాక్సిన్ ఉండాలని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: టీడీపీతో కొన్ని పాలసీల వరకే విభేదాలు: పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు