KRMB Projects : కృష్ణా బోర్డు పరిధిలోకి 29 ప్రాజెక్టులు..అంగీకారం తెలిపిన ఏపీ, తెలంగాణ

కృష్ణానదిపై తెలంగాణలోని ఏడు ప్రాజెక్టులు, ఏపీలోని 22 ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.

AP and Telangana projects : కృష్ణానదిపై తెలంగాణలో ఉన్న ఏడు ప్రాజెక్టులు, ఏపీలోని 22 ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకురావాలనే వాదననను పక్కన పెడుతూ.. ఇరు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌ జలసౌధలో గోదావరి బోర్డు, మధ్యాహ్నం కృష్ణా బోర్డు ఉప కమిటీ సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశాల్లో రెండు నదులపై తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఏయే ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్తాయనే అంశం ఓ కొలిక్కి వచ్చింది. తొలిదశలో తెలంగాణలోని 7 ప్రాజెక్టులు, ఏపీలోని 22 ప్రాజెక్టులను తీసుకోవాలని బోర్డు ప్రతిపాదించింది. దీనికి తెలంగాణ పూర్తి స్థాయిలో ఆమోదం తెలుపగా.. బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌పై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోకూడదని కోరింది.

India Petrol : వామ్మో పెట్రో ధరలు, తగ్గెదెన్నడు ?

ఇటు తెలంగాణ కూడా జలవిద్యుత్తు కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డుకు అప్పగించబోమని తేల్చి చెప్పింది. దీంతో కృష్ణా బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గోదావరిలో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలోకి తేవాలని గోదావరి బోర్డు ఉపకమిటీ భేటీలో నిర్ణయించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టును తొలిదశలో బోర్డుకు అప్పగించడానికి తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. సీడ్‌ ఫండ్‌ కింద తెలుగు రాష్ట్రాలు చెరో 200 కోట్లు ఇవ్వాలంటూ గోదావరి బోర్డు కన్వీనర్‌ బీపీ పాండే ఈ సందర్భంగా కోరారు. షెడ్యూల్‌-2లో ఉన్న మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన సిబ్బంది వివరాలు ఈరోజు సమర్పించాలని ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు