Gaganyan Mission TV D-1 : గగన్ యాన్ మిషన్ టీవీ డీ-1లో సాంకేతిక లోపం.. ప్రయోగాన్ని హోల్డ్ లో పెట్టిన ఇస్రో

సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగించాలనుకున్నారు. అయితే, మరోసారి గగన్ యాన్ టెస్ట్ లాంచ్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చివరి క్షణంలో కౌంట్ డౌన్ ను శాస్త్రవేత్తలు హోల్డ్ చేశారు.

Gaganyan Mission Technical Error

Gaganyan Mission TV D-1  Technical Error : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గగన్ యాన్ మిషన్ టీవీ డీ-1 ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. గగన్ యాన్ మిషన్ టీవీ డీ-1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని ఇస్రో హోల్డ్ లో పెట్టింది. చివరిక్షణంలో కౌంట్ డౌన్ ను హోల్డ్ చేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. కౌంట్ డౌన్ కు నాలుగు సెకండ్ల ముందు ప్రయోగం నిలిపివేశారు. సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

గగన్ యాన్ ప్రయోగoలో సాంకేతిక లోపం తలెత్తడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయోగ సమయాన్ని త్వరలో తెలియజేస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. టీవీ డీ -1 మిషన్ సేఫ్ గా ఉందన్నారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని సోమనాథ్ పేర్కొన్నారు. అయితే, ఇది మానవ సహిత ప్రయోగం. గగన్ యాన్ టెస్ట్ వెహికల్ టీవీ-డీ1 ఇస్రో మొట్టమొదటగా ప్రయోగించనుంది.

Gaganyaan: అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే మిషన్‌లో తొలి ఘట్టానికి సర్వం సిద్ధం.. ఏమిటీ TV-D1?

ఇస్రో మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్ యాన్ టెస్ట్ వెహికల్ టీవీ-డీ1ప్రయోగానికి నిన్న సాయంత్రం 7.30 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగించాలని భావించారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావించారు. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించాలని అనుకున్నారు.

కానీ, సాంకేతిక కారణాల వల్ల 30 నిమిషాలు ఆలస్యంగా 8.30 గంటలకు గగన్ యాన్ ను ప్రయోగించాలని భావించారు. మళ్లీ గగన్ యాన్ మిషన్ టీవీడీ-1 ప్రయోగం సమయంలో స్వల్ప మార్పు చేశారు. సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగించాలనుకున్నారు.  అయితే, మరోసారి గగన్ యాన్ టెస్ట్ లాంచ్ లో సాంకేతిక లోపం తలెత్తింది.

Team India : ప్ర‌పంచ‌క‌ప్ మ‌ధ్య‌లో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం..! భార‌త ఆట‌గాళ్ల‌కు మూడు రోజులు సెల‌వులు..?

దీంతో చివరి క్షణంలో కౌంట్ డౌన్ ను శాస్త్రవేత్తలు హోల్డ్ చేశారు. త్వరలో గగన్ యాన్ టీవీ డీ-1 ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మానవ సహిత ప్రయోగానికి ముందు క్రూ ఎస్కేప్ పరీక్ష. గగన్ యాన్ ప్రయోగంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి చేర్చే ఘట్టంలో ఏదైనా అవాంతరం చోటు చేసుకుంటే క్షేమంగా వారు తప్పించుకోవడానికి ఈ క్రూ ఎస్కేప్ సిస్టం ఉపయోగపడనుంది.

ట్రెండింగ్ వార్తలు