Andhra Pradesh : ఏపీలో టమాటా రైతు హత్య .. ఈ దారుణానికి కారణం అదేనా..?!

గిట్టుబాటు ధర లేక టమాటా రైతు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు టమాటా ధరలు భారీగా పెరగిన పరిస్థితిలో టమాటా రైతు దారుణ హత్యకు గురి కావటం ఆందోళన కలిగిస్తోంది.

Tomato farmer assassinate : గిట్టుబాటు ధర లేక టమాటా రైతు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు టమాటా రైతులు తమ పంటలకు కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారీగా పెరిగిపోయిన టమాటాల ధరలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో ధరలు బాగానే ఉంది చేతిని నాలుగు డబ్బులు వస్తాయని సంతోషపడాలో లేక టమాటా పంటను దొంగలబారిన పడకుండా కాపలా కాసుకోవాలా? అని ఆందోళన పడాలో అర్థం కాని పరిస్థితి రైతులది.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా రైతు దారుణ హత్య గురి అయ్యాడు. రాజశేఖర్ అనే టమాటా రైతు హత్యకు గురి కావటం దిగ్భ్రాంతికి గురి చేసింది. టమాటా రైతు రాజశేఖర్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. చేతులు వెనక్కు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ హత్యకు టమాటాల అధిక ధరలే కారణమా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అర్ధరాత్రి హత్య జరిగి ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగారు. కేసు నమోదు చేసుకుని డాగ్స్ స్క్కాడ్ రంగంలోకి దిగి దోషులను పట్టుకునే పనిలో పడ్డారు. హత్యకు కారణాలు ఏంటానే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Bengaluru: చెడు వ్యక్తులను మాత్రమే బాధ పెడతానని పోస్ట్ పెట్టి సీఈవో, మేనేజర్‭ను చంపేశాడు

కిలో టమాటాలు రూ.100 నుంచి 140 దాటి అమ్ముతున్నాయి. ఈ ధరలు సామాన్యుడికి భారంగా మారితే.. రైతులకు మాత్రం లాభాలు తెచ్చి పెడుతోంది. కానీ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా రైతు హత్య కలకలంరేపింది. టమాట అమ్మిన డబ్బులు ఉంటాయన్న ఆశతో ఆ డబ్బులను దోచేయటానికి రైతును దారుణంగా హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మదనపల్లె మండలం బోడిమల్లదిన్నెకు చెందిన నారెం రాజశేఖర్‌రెడ్డి టమాటా పంట వేశారు. పంట చేతికొచ్చింది. పంటకు భారీగా డిమాండ్ రావడంతో భార్యాభర్తులు ఇద్దరు పొలంలోనే మకాం వేసి వేయి కళ్లతో కాపలా కాసుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికే ఐదు కోతలు టమాటాలు కోసి అమ్మారు. ఈ క్రమంలో మంగళవారం (జులై11,2023)న కూడా మరోసారి టమాటాలు కోసి మార్కెట్ లో దించి వచ్చారు. రాజశేఖర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. వారిద్దరికీ వివాహం కావడంతో బెంగళూరులో నివాసం ఉంటున్నారు.

Haryana : హనుమాన్ చాలీసా చదివి షాక్ ఇచ్చిన ఘనుడు .. వీడు మామూలోడు కాదు..

రాజశేఖర్ రైతు కాబట్టి పాడి పశువులు కూడా ఉన్నాయి. ఈక్రమంలో మంగళవారం రాత్రి పాలు పోయడానికి ఊళ్లోకి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య ఆందోళనపడింది. దీంతో భయపడుతు రాజశేఖర్‌రెడ్డి బంధువుకు ఫోన్ చేసిన విషయం చెప్పింది. దీంతో వారు రాజశేఖర్ ను వెతుక్కుంటు వెళ్లగా ఓ చోట అతను బైక్, మొబైల్ ఫోన్ పడి ఉండటం కనిపంచాయి. దీంతో ఆ చుట్టుపక్కలంతా వెతగ్గా ఓ చోట చెట్టు కింద చేతులు, కాళ్లు టవల్ తో కట్టేసి రాజశేఖర్ రెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా..ఇటీవల కొన్ని వారాలుగా టమాటా ధరలు భారీగా పెరగడంతో.. రైతు రాజశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయని భావించి.. దోచుకోవడానికి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు