Pawan Kalyan : సీఎం పదవికి జగన్ అనర్హుడు, చావుకైనా సిద్ధమే- పవన్ కల్యాణ్

Pawan Kalyan : మన ఖజానా 10 లక్షల కోట్లు.. ఆ సంపద దేని కోసం ఖర్చు పెట్టారో చెప్పాలి? రాష్ట్ర ఖజానా సరిగా ఖర్చు పెడుతున్నారా లేదా?

Pawan Kalyan

Pawan Kalyan : ముఖ్యమంత్రి పదవికి సీఎం జగన్ అనర్హుడు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏలూరులో వారాహి బహిరంగ సభలో సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు పవన్.

”వారాహి విజయ యాత్ర రెండో దశకు ఇంత ఘన స్వాగతం లభిస్తుందని అనుకోలేదు. మీరు చూపించే ప్రేమతో నా గుండె నిండిపోయింది. హలో ఏపీ.. బై బై వైసీపీ.. ఇదో నినాదం. దీని వెనుక ఎంతో సంఘర్షణ ఉంది. ఇది నా నుంచి వచ్చిన నినాదం కాదు.. ఏపీ ప్రజల నినాదం .
సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదు. పాఠశాలల్లో మహాత్ముల గురించి చెప్తారు. వచ్చే తరం కోసం నిలబడాలని.. చాలా నలిగి ఈ నిర్ణయం తీసుకున్నాజ. గెలుపు ఉంటుందో లేదో తేలీదు. రాజకీయ విలువల కోసం నేను మాట్లాడుతుంటే.. వైసీపీ వాళ్లు నా తల్లి గురించి, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. దిగజారి మాట్లాడుతున్నారు. సీఎం మంచి వాడా? కాదా? అనవసరం. ఆ స్థానానికి నేను గౌరవం ఇస్తాను.

Also Read..Purandeswari: విశాఖ ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీచేస్తారా.. జీవీఎల్ పరిస్థితి ఏంటి?

ఏలూరు సభ నుంచి జగన్ ను.. ఏకవచనంతోనే పిలుస్తాను. కారణం జగన్ దిగజారి మాట్లాడుతున్నాడు. జగన్ అనే వ్యక్తి సీఎం పదవికి అనర్హుడు. జగన్ మళ్లీ ఎందుకు రాకూడదో చెప్తా. గతాన్ని చూసి భవిష్యత్తును నిర్ణయిస్తాం. అందరికీ సమస్యలు ఉన్నాయి. పోలీసుల దగ్గరి నుంచి యువత, ఆడపడుచులు రక్షణ, పింఛను ఇలా ఎన్నో. ఏలూరులో వరద వస్తే రక్షణ గోడలు లేవు, గంజాయి పెరిగిపోయింది. మనం జగన్ బానిసలం కాదు… మనకన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు సమానం అంతే. కాకపోతే ఎక్కువ బాధ్యత అతనికి ఇచ్చాం. మన ఖజానాకు జవాబుదారీ జగన్.

విద్యార్థులకు వసతి దీవెన ఎందుకు రావడం లేదు? మన ఖజానా 10 లక్షల కోట్లు.. ఆ సంపద దేనికోసం ఖర్చు పెట్టారో చెప్పాలి? రాష్ట్ర ఖజానా సరిగా ఖర్చు పెడుతున్నారా లేదా. కాగ్ సంస్ధ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. కాగ్ సంస్ధ పాతిక లోపాలను ఎత్తి చూపింది. ఎక్కడెక్కడ నిధులు దుర్వినియోగం చేశారో కాగ్ చెప్పింది. చాలామంది బలిదానాలపై మన దేశం ఏర్పడింది. రాష్ట్ర బడ్జెట్ లో పదో వంతు అప్పులు తెచ్చారు. దాని విలువ 1.18 లక్షల కోట్లు ప్రజలు అడిగినప్పుడు లెక్కలు చెప్పాలి.. కానీ వాళ్ళ దగ్గర సమధానం లేదు. జగన్ నిన్ను అడుగుతున్నా… 1.18లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేశావ్?.. కాగ్ అడిగిన ప్రశ్నకు ఎందుకు సమధానం చెప్పలేదు. దీనికి జగన్, మంత్రి వర్గం సమధానం చెప్పాలి” అని పవన్ అన్నారు.

” జగన్ చెవులు రిక్కించి విను.. బడ్జెట్ లో చూపించని లక్షల కోట్లు ఎవరికి ఖర్చు పెట్టావు? రోడ్లు లేవు.. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద.. 4754 కోట్లు తెచ్చావు ఏం చేశావు? రాష్ట్ర ఖజానా అనుమతి లేకుండా నిధులు దుర్వినియోగం చేశారు. ఇన్ని వేల కోట్లు సర్దుబాటు లావాదేవీల పేరుతో ఎలా దుర్వినియోగం చేస్తారు? ప్రతిపాదించిన సంక్షేమ పథకాలకు కేటాయించిన బడ్జెట్ 7762 కోట్లు. ఇంత డబ్బు ప్రకటించారు కానీ ఈ సొమ్ము పథకాలకు వెళ్ళలేదు.

Also Read..Minister Amarnath : పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో సైడ్ హిరో, చంద్రబాబు విలన్ : మంత్రి అమర్నాథ్

ఏలూరులో పెద్దాసుపత్రి ఉంది.. కానీ మందులకు డబ్బులు ఇవ్వరు. 250 కోట్లు ఆస్పత్రుల అభివృద్దికి కేంద్రం ఇస్తే దాన్ని పక్క దారి పట్టించారు. ఆరోగ్యశ్రీ ఇస్తే సరిపోదు.. ప్రభుత్వ ఆస్పత్రులను చంపకూడదు. ఆస్పత్రుల నిధులను జగన్ దోచేశాడు. నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నా. నేను ఎందుకు తిట్లు తింటున్నా. నా భార్య, నా తల్లి ఎందుకు తిట్లు తింటున్నారు. మీ కోసమే. వింత వ్యాధితో 300 మంది పడిపోతే.. దానిపై ఇప్పటికీ రిపోర్టు లేదు. బుగ్గలు నిమిరి, హత్తుకునే నాయకులను నమ్మొద్దు. మాటపై నిలబడే వ్యక్తులను నమ్మాలి. ఏలూరు నగర పాలక సంస్థలో ఎన్నో అక్రమాలు జరిగాయి. దీనిపై నిజాయితీ గల అధికారి మాట్లాడితే.. బదిలీ చేసి పంపించారు.

ఏలూరుకి భూగర్భ డ్రైనేజీ అనేది కల.దీని కోసం కేంద్రం అమృత్ పథకం కింద నిధులు ఇచ్చింది. పేదలకు ఇళ్లు కట్టిస్తామని అనంతపురానికి చెందిన వ్యక్తి వచ్చి మహిళల దగ్గర 35 వేలు ఎత్తుకుపోయాడు. 115 ఏళ్ల కృష్ణా జ్యూట్ మిల్లును మూసేస్తే ఎవరూ మాట్లాడలేదు. వారికి అండగా నిలబడలేదు. కార్మికుల కోసం ఎందుకు మాట్లాడలేదు? నేను కార్మికుల పక్షాన మాట్లాడితే.. జగన్ నా గురించి మాట్లాడతాడు. మనుషులంతా నా వాళ్లు అనుకున్నా… ఒక కులం నాది అనుకోలేదు” అని పవన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు