Today Gold Prices : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గుతున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మొన్నటివరకూ భారీ పెరుగుదలతో దూసుకెళ్లిన బంగారం ధరలు మంగళవారం (ఫిబ్రవరి 1) తగ్గినట్టు కనిపిస్తోంది.

Today Gold Prices : మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మొన్నటివరకూ భారీ పెరుగుదలతో దూసుకెళ్లిన బంగారం ధరలు మంగళవారం (ఫిబ్రవరి 1) తగ్గినట్టు కనిపిస్తోంది. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తుంటాయి.. అయితే మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గినప్పుడే వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

కొన్ని రోజుల నుంచి పెరుగుతు వచ్చిన బంగారం ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. నేటి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.44,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,990 పలుకుతోంది. ఈరోజు తులం బంగారం ధర రూ.100 వరకు తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఏయే నగరాల్లో బంగారం ధరలు ఎంతంటే :
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,270 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,390 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. తెలంగాణలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా పలుకుతోంది.

Read Also : AP PRC : మిశ్రా కమిటీ నివేదికలో ఏం రహస్యం ఉంది? ఎందుకు బయటపెట్టడం లేదు?

ట్రెండింగ్ వార్తలు