Heart Attack : గుజరాత్ లో నవరాత్రి వేడుకల్లో విషాదం.. గర్భా ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

గర్భా వేదికల వద్ద డాక్టర్లు, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచేందుకు ఈవెంట్ నిర్వహకులు చర్యలు చేపడతున్నారు. సీపీఆర్ చేయడంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్వహకులు అధికారులను కోరుతున్నారు.

young man died of heart attack

Heart Attack Young Man Died : గుజరాత్ లో నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. గడిచిన 24 గంటల్లో పది మంది గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో టీనేజర్ల నుంచి మధ్య వయసు కలిగిన వారు ఉన్నారు. తాజాగా బరోడాలోని దభోయ్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు గర్భా వేడుకల్లో గుండెపోటు రావడంతో మరణించారు. కపద్వంజ్ లో గర్భా ఆడుతూ 17 ఏళ్ల మరో యువకుడు కుప్పకూలిపోయాడు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలతో 108 ఎమర్జెన్సీ సర్వీసులకు 521 కాల్స్ రాగా, శ్వాస సంబంధిత సమస్యలతో 609 కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్ అన్నీ గర్భా వేడుకలు జరిగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల మధ్యే రావడం గమనార్హం. గర్భా వేదికలకు సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం చేసింది.

Mumbai : లోకల్ ట్రైన్‌లో గర్బా డాన్స్ చేసిన ప్రయాణికుల వీడియో వైరల్

ఎమర్జెన్సీ కేసుల విషయంలో సత్వరమే స్పందించేందుకు అంబులెన్స్ లు వేగంగా వచ్చేందుకు కారిడార్స్ ఏర్పాటు చేయాలని కోరింది. మరోవైపు గర్భా వేదికల వద్ద డాక్టర్లు, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచేందుకు ఈవెంట్ నిర్వహకులు చర్యలు చేపడతున్నారు. సీపీఆర్ చేయడంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్వహకులు అధికారులను కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు