Uttar Pradesh : జై శ్రీరాం అనాలంటూ.. వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టి, జుట్టు కత్తిరింపు

ఈ ఘటన మొబైల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆపై బాధితుడు ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

man beaten

Man Beaten And Hair Cut Off : ఉత్తరప్రదేశ్ లో దారుణంman beaten జరిగింది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు తీవ్రంగా కొట్టి జై శ్రీరాం అనాలని వేధింపులకు గురిచేశారు. ఈ సంఘటన బులంద్ షహర్ లో చోటు చేసుకుంది. మొత్తం ఘటనను వీడియోలో రికార్డు చేయడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

జూన్ 13న ఈ ఘటటన జరగ్గా బాధిత కుటుంబ సభ్యులు ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో శనివారం నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహిల్ కకొడ్ అనే వ్యక్తి గ్రామ బస్ స్టాండ్ లో నిల్చుని ఉన్నాడు. ముగ్గురు యువకులు అక్కడకు వచ్చి బలవంతంగా అతడిని బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు.

Heavy Rains : భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. విరిగిపడిన కొండచరియలు, వాహనాల రాకపోకలకు అంతరాయం

మొబైల్ చోరీ చేశావని ప్రశ్నిస్తూ అతడిని చెట్టుకు కట్టేసి కొడుతూ తల వెంట్రుకలు తొలగించారు. ఆపై జై శ్రీరాం అనాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేశారు. ఈ ఘటన మొబైల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆపై బాధితుడు ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తనపై మొబైల్ చోరీ ఆరోపణలు మోపి అరెస్ట్ చేశారని బాధితుడు వాపోయాడు. జూన్ 17న బాధితుడి తల్లిదండ్రులు ఏఎస్పీని కలిసి ఘటన వీడియోను అందజేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు