Rajastan Unsafe: మహిళలకు అస్సలు భద్రత లేని రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానం: జాతీయ మహిళా కమిషన్

దేశంలో మహిళలకు అస్సలు భద్రత లేని రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్నీ ఏ ప్రైవేటు సంస్థో, వ్యక్తిగత అభిప్రాయంగా కాదు..సాక్షాత్తు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది

Rajastan Unsafe: దేశంలో మహిళలకు అస్సలు భద్రత లేని రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్నీ ఏ ప్రైవేటు సంస్థో, వ్యక్తిగత అభిప్రాయంగా కాదు..సాక్షాత్తు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. రాజస్థాన్ రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలపై అకృత్యాలు అంతకంతకూ పెరుగుతున్నాయని..జాతీయ మహిళా కమిషన్ (NCW)కు ఇటీవల ఒక నివేదిక వచ్చింది. రానురాను రాజస్థాన్ లో మహిళలు, ఆడపిల్లలకు అస్సలు భద్రత ఉండడంలేదని..పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నారు.

Also read:Old man locked in Bank: పాపం పెద్దాయన.. రాత్రంతా బ్యాంకులోనే ఉంచి తాళం వేశారు..!

మహిళలు బాలికలపై అత్యాచారాల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని, దేశంలో మహిళలకు అత్యంత భద్రత లేని రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటిగా మారిందని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఈమేరకు మహిళల రక్షణ నిమిత్తం రాష్ట్రంలో తీసుకున్న చర్యలపై చర్చించేందుకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ మార్చి 16న రాజస్థాన్ పోలీసులతో సమావేశం అయ్యారు. ఇప్పటివరకు జరిగిన నేరాలపై మహిళా కమిషన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, సుమోటోగా స్వీకరించిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ ఆలస్యం చేస్తుండడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదికలను పంపడంలో జాప్యంపై కూడా కమిషన్ వివరణ కోరింది.

Also read:Mamata Banerjee: బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు మమతా బెనర్జీ లెటర్

రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరిగిన నేరాలకు సంబందించిన వివరాలను సంవత్సరాల వారీగా వివరిస్తూ రాజస్థాన్ పోలీసులు మహిళా కమిషన్ ముందుంచారు. అన్ని విషయాలలో పెండింగ్‌లో ఉన్న నివేదికలను కమిషన్‌కు వీలైనంత త్వరగా పంపుతామని పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో.. మహిళలు, బాలికలపై అత్యాచారాలు అధికంగా ఉన్నట్లు గత నివేదికలు సూచిస్తున్నాయి. అయితే నేరాలను అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల్లో పోలీసులు, ప్రభుత్వాలు పటిష్ట రక్షణ చర్యలు తీసుకున్నాయి. కానీ రాజస్థాన్ లో మాత్రం పోలీసులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ మహిళల రక్షణ కొరకు ఎటువంటి క్రియాశీలక భద్రత చర్యలు తీసుకోలేదు.

Also read:PM Modi – PMAY: 5.21 లక్షల మంది పేదలకు ఇళ్ల పంపిణీ ప్రారంభించిన ప్రధాని మోదీ

ట్రెండింగ్ వార్తలు