Bandi Sanjay Arrest : టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బండి సంజయ్ అరెస్టు.. నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధ చేసిన బీజేపీ శ్రేణులు

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. పోలీస్ స్టేషన్ కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఇక అర్ధరాత్రి వేళ తన ఇంట్లోకి చొరబడి తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

Bandi Sanjay Arrest : తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు అయ్యారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో కరీంనగర్ లోని ఎంపీ సంజయ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే కార్యకర్తలు అడ్డుకోవడానికి యత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బండి సంజయ్ ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని బీజేపీ కార్యకర్తలు పోలీసులను నిలదీశారు. అయితే సమాధానం చెప్పకుండా బండి సంజయ్ ను పోలీసులు ముందుకు తీసుకెళ్లారుు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కు గాయమైంది.  అర్ధగంటకు పైగా పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు అడిషనల్ డిసిపి చంద్రమోహన్ వెంటపడ్డారు. తమ నాయకుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ బీజేపీ కార్యకర్తలు సీఐ దామోదర్ కాళ్లు మొక్కారు.  కాగా, 151 సీఆర్ పీసీ కింద బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చినట్లు, ప్రివెంటివ్ అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.

Bandi Sanjay: అందుకే ప్రశ్నపత్రాల లీకేజీలు.. ఇప్పుడు టెన్త్ విద్యార్థుల్లో ఒత్తిడి, గందరగోళం: బండి సంజయ్

మరోవైపు బండి సంజయ్ ను తిమ్మాపూర్ మీదుగా తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో పోలీసు వాహనం మోరాయించింది. దీంతో ఆయనను మరో వాహనంలో ఎక్కించారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. పోలీస్ స్టేషన్ కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఇక అర్ధరాత్రి వేళ తన ఇంట్లోకి చొరబడి తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ను అరెస్టు చేయడం పట్ల బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఏ కారణం లేకుండా తప్పుడు ఆరోపణలు చేసి బండి సంజయ్ ను అరెస్టు చేశారంటూ బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు.

10th Question Paper Leak: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు..

రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలను బండి సంజయ్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ అన్నారు. వెంటనే విడుదల చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నాయకత్వం.. పాలన చేతకాక బండి సంజయ్ ను అరెస్టు చేసిందని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు రాజకీయ సమాధి అయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఒక ఎంపీనీ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు.

10th Paper Leak : టెన్త్ పేపర్ లీక్.. తెలిసిన విద్యార్థుల కోసమే

కేసీసఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పు దోవపట్టించడానికి బండి సంజయ్ అరెస్ట్ నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన సతీమణి అపర్ణ అన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదని తెలిపారు. ఎటు తీసుకెళ్తున్నారో చెప్పలేదని పేర్కొన్నారు. తమ పిల్లలు అడ్డుకోవడానికి వెళ్తే నెట్టివేశారని పేర్కొన్నారు. ఇంట్లో మా అమ్మ కర్మ కార్యక్రమం ఉందని.. అరెస్ట్ చేయవద్దని కోరిన పోలీసులు వినలేదని వాపోయారు. లీగల్ ఫైట్ చేస్తామని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు