Uttar Pradesh : నమాజ్ కోసం బస్ ఆపిన కండక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం .. మనస్తాపంతో ఆత్మహత్య

దాదాపు పదిమంది ఉన్న కుటుంబానికి అతని ఉద్యోగమే జీవనాధారం. కానీ మానవత్వం చూపినందుకు ఉన్న ఉద్యోగం పోయింది. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Uttar Pradesh RTC Conductor Mohit Yadav

Uttar Pradesh RTC Conductor Mohit Yadav : నమాజ్ కోసం బస్సు ఆపాడు అనే ఆరోపణలతో యూపీ(Uttar Pradesh)లో ఆర్టీసీ కండక్టర్ (Conductor )ను సస్పెండ్ చేశారు. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురి అయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్లిం సోదరుల కోసం మానవత్వంతో తన భర్త బస్సు ఆపినందుకు ఇంత దారుణంగా ఉద్యోగం నుంచి తొలగించారని దీంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ మృతుడి భార్య వాపోయింది. మానవత్వం చూపించటమే తన భర్త చేసిన తప్పా..? కనీసం ఎందుకు ఇలా చేశావనే వివరణ కూడా తీసుకోకుండా ఉద్యోగం నుంచి తీసివేయటం దారుణమని ఆ మనస్తాపంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది కండక్టర్ భార్య.

Lover kissing : ప్రియురాలిని ముద్దు పెట్టుకుని కర్ణభేరి పగిలి ఆస్పత్రిపాలైన యువకుడు

ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh)లో రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (State Road Transport Corporation)లో కాంట్రాక్ట్ విధానం(contract basis)లో కండక్టర్ గా పనిచేసేవాడు మోహిత్ యాదవ్ (Mohit Yadav)అనే వ్యక్తి. రూ.17 వేల జీతానికి పనిచేసేవాడు. కుటుంబంలో మొత్తం ఎనిమిదిమంది ఉండేవారు. కుటుంబానికి అతనే పెద్దవాడు కావటంతో కుటుంబ భారమంతా అతనిమీదనే ఉండేది. అలా కేవలం రూ.17వేలకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుండేవాడు మోహిత్ యాదవ్. ఈక్రమంలో గత నెల జూన్‌లో ఓ రోజు మోహిత్ బరేలీ నుంచి డీల్లీ వెళుతున్న బస్సులో డ్యూటీలో ఉన్నాడు. ఆ బస్సులో ఇద్దరు ముస్లింలు ప్రయాణిస్తున్నారు. వారికి నమాజ్ సమయం కావటంతో కండక్టర్ బస్సు ఆపమని కోరారు. దానికి మోహిత్ కూడా సరేనంటూ వారు నమాజ్ చేసుకోవటానికి వీలుగా కొద్దిసేపు బస్సు ఆపాడు.

ఈ విషయం కొన్ని రోజులకు సదరు ట్రాన్స్ పోర్టు యాజమాన్యానికి తెలిసింది. దీంతో యూపీ ఆర్‌టీసీ అతడిని అతడి కాంట్రాక్ట్ రద్దు చేసి ఉద్యోగం నుంచి తీసివేసింది. కనీసం వివరణ కూడా కోరకుండా ఇలా అర్థాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించటంతో దిక్కుతోచలేదు మోహిత్ కు. అదే విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించినా ఎటువంటి సమాధానం చెప్పటేదు. దీంతో వేరే దారి లేక కుటుంబం కోసం మరో ఉద్యోగం వెతుకునే పనిలో పడ్డాడు. కానీ చాలా చోట్ల యత్నించినా ఉద్యోగం దొరకలేదు. అప్పటికే కుటుంబ భారం పెరిగిపోయింది. చాలా అప్పులు చేశాడు. ఓ పక్క ఉద్యోగం లేక అప్పులు తీర్చే శక్తి లేక ఆర్థికకష్టాల్లో కూరుకుపోయిన మోహిత్ యాదవ్ సోమవారం (ఆగస్టు28,2023) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Parrot : చిత్రహింసలు పెట్టి చిలుకను చంపిన ఇద్దరు మహిళలకు జైలు శిక్ష

మోహిత్ ఆత్మహత్యతో అని భార్య భావురుమంది. గుండెలు అవిసేలా ఏడ్చింది. మానవత్వం చూపించినందుకు దక్కిన ఫలితమా.. ఇది అంటూ ఏడ్చింది. తన భర్త ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కనీసం వివరణ కూడా యాజమాన్యం పట్టించుకోకుండా సడెన్ గా ఉద్యోగం నుంచి తీసివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎనిమిది మంది ఉన్న కుటుంబ బాధ్యత మొత్తం తన భర్తదేనని..ఆయనకొచ్చే 17 వేల జీతంపైనే మా కుటుంబం ఆధారపడిందని ఓ పక్క భర్తను కోల్పోయి మరో పక్క కుటుంబం దిక్కులేకుండా పోవటంతో క్షణమొక యుగంలా గడుపుతున్నామని కన్నీటితో తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు