Wife Kidnapped Her Husband : విడాకులు కోసం ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేసిన భార్య

ప్రియుడి మోజులో పడిన భార్య, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించింది. ఘటన జరిగిన మూడు గంటల్లోనే పోలీసులు భర్తను విడిపించి కిడ్నాపర్లను అరెస్ట్

Wife Kidnapped Her Husband : ప్రియుడి మోజులో పడిన భార్య, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించింది. ఘటన జరిగిన మూడు గంటల్లోనే పోలీసులు భర్తను విడిపించి కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్ వాజిద్(31), 2012 లో అప్షియా బేగం(24) అనే యవతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.  వాజిద్ మౌలాలీ బస్టాప్ ప్రాంతంలో ఓ చెప్పుల దుకాణంలో సేల్స్ మెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో ఉండే అప్షియా బేగం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. దీంతో ఆమెకు ముషీరాబాద్ కు చెందిన క్యాటరింగ్ పని చేసే ఆసిఫ్ పరిచయం అయ్యాడు.

ఆసిఫ్ కు అప్పటికే రెండు సార్లు పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అప్షియా, ఆసిఫ్ మంచి స్నేహితులుగా మారారు. ఆసిఫ్ తో స్నేహం ముదిరి ప్రేమగా మారింది. గత ఏప్రిల్ నెలలో ఎవరికీ చెప్పా పెట్టకుండా అప్షియా ప్రియుడు దగ్గరకు వెళ్లిపోయింది. తన భార్య కనిపించటంలేదని వాజిద్ మల్కాజ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
Also Read : Mumbai Man Kills Wife : పక్కింటోళ్ల మీద పోట్లాటకు రాలేదని భార్యను చంపిన భర్త

పోలీసులు  విచారణ చేపట్టి  ఆమెను వెతికి పట్టుకువచ్చి భర్తకు అప్పగించారు. మరోసారి  పిల్లలను తీసుకుని ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది. అత్తమామలతో మాట్లాడి ప్రియుడి వద్ద ఉన్న భార్యను మళ్లీ ఇంటికి తెచ్చుకున్నాడు. ప్రియుడితో అలవాటు పడిన అప్షియాకు భర్త అంటే వ్యతిరేకత ఏర్పడింది. ఎలాగైనా భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. ఇందుకోసం ఒక పధకం రచించింది.

ముషీరాబాద్ లోని ఖాజీ ఎదుట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి ద్వారా ఇందుకోసం అన్నీ సిధ్దం చేసుకుంది. ప్రియుడు ఆసిఫ్, ప్రియురాలి భర్త వాజిద్ ను కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు మనుషులను మాట్లాడాడు. సోమవారం సాయంత్రం ఈ ముగ్గరు యువకులతో కలిసి ఆసిఫ్, వాజిద్ పని చేస్తున్న చెప్పుల షాపు వద్దకు వచ్చి బలవంతంగా ద్విచక్ర వాహానాలపై ఎక్కించుకుని కిడ్నాప్ చేసి ముషీరాబాద్ తీసుకు వెళ్లారు.ముషీరాబాద్ లోని ఒక ఇంట్లో వాజిద్ ను తీవ్రంగా కొట్టి అతని వద్దనుంచి విడాకుల కాగితాలపై సంతకాలు తీసుకున్నారు.

వాజిద్ సాయంత్రం 6 గంటల సమయంలో కిడ్నాప్ కు గురికాగా షాపు యజమాని 8 గంటల సమయంలో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా కిడ్నాప్ వ్యవహారాన్ని పరిశీలించారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి బాధితుడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాజిద్ ను బంధించిన ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో వాజిద్ ను గుర్తించి రక్షించారు. అప్షియాతోపాటు మరో ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేయగా ప్రధనా నిందితుడుఅసిఫ్ తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు