JOBS : ఎన్ హెచ్ఎల్ఎమ్ఎల్ లో పలు పోస్టుల భర్తీ

ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్దుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

JOBS : భారత పభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ ఎల్ ఎమ్ ఎల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ రోప్ వేస్, మేనేజర్ లాజిస్టిక్స్, సీనియర్ మేనేజర్ ప్యాసింజర్ కన్వీనియన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కంపెనీ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ, మేనేజర్ ఓఎఫ్సీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తదితర ఖాళీలు ఉన్నాయి.

ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్దుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి. ఎంపికకు సంబంధించి సెలక్షన్ కమిటీ అధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఈ మెయిల్, ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ఎస్.హెచ్. రవీంద్ర , డైరెక్టర్, నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, జి5&6 సెక్టార్ 10, ద్వారక , న్యూదిల్లీ, ఈ మెయిల్ ; ravinder.nhlml@nhai.org,దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా జులై 4, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://nhai.gov.in/#/పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు