Onion In Underarms : చంకలో ఉల్లిగడ్డ పెట్టుకుంటే జ్వరం వస్తుందా..? నిజమెంత..?

ఉల్లిగడ్డ చంకలోపెట్టుకుని జ్వరం వస్తుందా..? నిజమేనా..? వస్తే ఎందుకు వస్తుంది? దీనికి కారణాలేంటీ? ఉల్లిచేసిన మేలు తల్లికూడా చేయదంటారు. అటువంటి ఉల్లిపాయ వల్ల జ్వరం వస్తుందా? అదికూడా చంకలో పెట్టుకుంటేనే జ్వరం వస్తుందా.? ఎప్పుడైనా మీరు అలా ట్రై చేశారా?దీంట్లో నిజమెంత..?

Onion In Underarms will get fever

Onion In Underarms will get fever : చంక‌లో ఉల్లిగడ్డ (ఉల్లిపాయ) పెట్టుకుంటే జ్వరం వస్తుందా? దీంట్లో నిజమెంత..? మరి జ్వరానికి ఉల్లిపాయకు సంబంధముందా..? ఉల్లిపాయ చంకలో పెట్టుకుంటే నిజంగా నే జ్వరం వస్తుందా..? సినిమాల్లో ఉల్లిగడ్డ చంకలోపెట్టుకుని జ్వరం వచ్చిందని డ్రామా ఆడినట్లుగా చూశాం.కానీ నిజంగా ఉల్లిగడ్డ వల్ల జ్వరం వస్తుందా..? ఇటువంటి డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా..? ఎప్పుడైనా మీరు అలా ట్రై చేశారా? హా..అందంతా ఫేక్ అనుకుంటున్నారా.. దీంట్లో నిజమెంతో తెలుసుకుందాం..డౌట్ ఉంటే క్లియర్ చేసేసుకోవాలంతే..ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదంటారు.మరి అటువంటి ఉల్లి జ్వరం వచ్చేలా చేస్తుందా..? అసలు దీంట్లో నిజమెంత..?అనే విషయం తెలుసుకుందాం..

ఉల్లిపాయ‌ పొట్టుతీసి .. దాన్ని నిలువుగా కోసి దానిని రెండు చంకల్లో గంటసేపు ఉంచితే..చంక(Underarms)లో మృదువుగా ఉండే పైపొర ఉల్లిరసాన్ని తొందరగా గ్రహిస్తుంది. దాని కార‌ణంగా శరీరం ఒక్క‌సారిగా వేడెక్కుతుంది. శ‌రీర స‌గ‌టు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువగా శరీరం వేడెక్కుతుంది. దీనినే మ‌నం జ్వ‌రం అంటాం. ఉల్లిపాయలో ఉండే సహజ రసాయనాలైన సుఫాక్సీడ్, ఐసోలైన్‌, ఎలిసిన్ లు శరీరాన్ని వేడెక్కిస్తాయి. అంతేకాదు ఉల్లిపాయ శ‌రీరంలోని ఉపయోగ‌క‌ర‌మైన సూక్ష్మజీవుల్ని, వైరస్‌ల‌ను ఆకర్షించి తొలగిస్తుంది. దీని కార‌ణంగా శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా నిలిచే సూక్ష్మజీవులు లేకపోవటం వల్ల జ్వ‌రం వ‌స్తుంది.

Hospitals Colors : ఆస్పత్రుల్లో ఆకుపచ్చ, నీలం రంగులనే ఎందుకు వాడతారో తెలుసా..?

కానీ ఉల్లిపాయ వల్ల వచ్చిన జ్వరం కూడా ఎక్కువ సేపు ఉండదు. ఇది అనారోగ్యం వల్ల వచ్చిన జ్వరం కాదు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఉల్లిపాయతో జ్వరం తెప్పించుకోవటం అంటే హార్మోన్ల‌ను మ్యానేజ్ చేసి జ్వ‌రం తెప్పించుకోవ‌డం లాంటిదే. కానీ ఇటువంటి ట్రిక్కులు అందరికి పనిచేయవని గుర్తించుకోవాలి. బీపీ, డయాబెటిక్ సమస్యలు ఉన్నవారు ఇటువంటి ట్రిక్స్ చేయకపోవటమే మంచిదంటున్నారు నిపుణులు. ఇది కేవలం సూచనల మాత్రమే కాదు ఓ మాదికి వార్నింగ్ అని కూడా గుర్తించాలి.

శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ల్లో తీవ్ర‌మైన హెచ్చు త‌గ్గులు వ‌స్తే బీసీ, డయాబెటిక్ సమస్యలు ఉన్నవారికి ప్రమాదం. కానీ ఏది ఏమైనా ఇటువంటి ట్రిక్స్ అనారోగ్య సమస్యలు ఉన్నవారే కాదు ఎవ్వరు చేయకపోవటమే మంచిది. అరోగ్యం ఉండే శరీరాన్ని ఇబ్బందులకు కావాలని గురి చేయటమే అవుతుంది. కాబట్టి సో బీకేర్ ఫుల్..ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయనదే మంచి మాటకు చెడు తీసుకురాకుండా బుద్దిగా ఉంటే మంచిది.

PFAS in rainwater : వర్షంలో తడిస్తే ఇకపై పిల్లలు పుట్టరట




											




                                    

ట్రెండింగ్ వార్తలు