Omicron..Christmas party : క్రిస్మస్ సెలబ్రేషన్‌లో 120 మంది.. 100 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ

ఒమిక్రాన్ గుబులు రేపుతున్న క్రమంలో ఓ క్రిస్మస్ పార్టీలో 120మంది పాల్గొన్నారు.వారిలో 100మందికి ఒమిక్రాన్ గా నిర్దారణ అయ్యింది.

Omicron..Christmas party శీతాకాలం వచ్చిదంటూ క్రిస్మస్ సంబరాలు మొదలైపోతాయి. ఈ కరోనా కాలంలో క్రిస్మస్ పండుగ వేడుకలు జరుపుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.లేదంటే తప్పదు ముప్పు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వేరింయట్ టెన్షన్ సమయంలో క్రిస్మస్ పండుగ ముప్పు తెచ్చి పెట్టింది. క్రిస్మస్ పండుగ వేడుకల్లో 120మంది పాల్గొంటే వారిలో 100మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ 100మందికి ఒమిక్రాన్ గా నిర్దారణ అయ్యింది. నవంబర్ 26న నార్వేలో జరిగిన ఈ క్రిస్మస్ పార్టీలో దీంతో వారితో కాంటాక్ట్ అయినవారి పరిస్థితి ఏంటానే ఆందోళన మొదలైంది.

Read more : Coronavirus: దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు

డెల్టా ప్రభావంతో వణికిపోతోన్న ప్రపంచ దేశాలను కొత్త రూపంలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరోసారి కలవరపెడుతోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్‌ ప్రభావంతో రానున్న రోజుల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఇప్పటికే ఎన్నో దేశాలు అంచనాలు వేసుకుంటున్నాయి. అప్రమత్తవమవుతున్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్ 38 దేశాలకు వ్యాపించిన ఆ సంఖ్య కాస్తా 46కు చేరింది. ప్రజల నిర్లక్ష్యం…ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తం కాకపోవటంతో ఒమిక్రాన్ వ్యాప్తికి కారణంగా మారుతోంది.

నవంబరు 26 జరిగిన ఈ పార్టీకి హాజరైన 120 మందిలో 100 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో వారి నమూనాలను సేకరించి జన్యు విశ్లేషణ పరీక్షలకు పంపగా.. ఇప్పటి వరకూ వచ్చినవారి నివేదికల్లో అందరికీ ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. అంతేకాదు..క్రిస్మస్ పార్టీ ముగిసిన తర్వాత అదే హోటల్‌కు వచ్చిన 30 మంది కస్టమర్లు వైరస్ బారినపడటం గమనించాల్సిన విషయం. దీంతో క్రిస్మస్ వేడుక కాస్తా ఒమిక్రాన్ సూపర్‌స్ప్రెడర్‌గా మారిపోయింది.

Read more : Rs.1000 Chole Bhature : ఒక్క ప్లేట్‌ ‘చోలె భ‌టురే’ ధర‌ రూ.1000…

ఇదిలా ఉంటే..గత రెండు రోజుల క్రితానికి నార్వేలో 19 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీరిలో 13 మంది క్రిస్మస్ పార్టీకి హాజరైనవారే కావటం గమనించాల్సిన విషయం. క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేసిన సదరు సంస్థ మాత్రం తమ ఉద్యోగులు 70 మందే ఆ పార్టికి వెళ్లారని..మిగిలిన వారు బయటివారేనంటోంది. అంతేకాదు వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్నారనీ..పార్టీలో కూడా వీరు కరోనా నిబంధనలు పాటించారని చెబుతోంది సదరు సంస్థ. ఏది ఏమైనా ఒమిక్రాన్ వ్యాప్తిని నివారించటం అనేది ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలుసుకోవాలి.

 

ట్రెండింగ్ వార్తలు