US : అప్ఘాన్‌లో అమెరికా మిషన్ కంప్లీట్

అఫ్ఘాన్‌లో అమెరికా మిషన్ ముగిసిందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. మిషన్‌ అఫ్ఘాన్‌ విజయవంతమైందని.. ఎన్నో చర్చల తర్వాతే సైన్యాన్ని ఉపసంహరించామని చెప్పారాయన.

Joe Biden : అఫ్ఘాన్‌లో అమెరికా మిషన్ ముగిసిందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. మిషన్‌ అఫ్ఘాన్‌ విజయవంతమైందని.. ఎన్నో చర్చల తర్వాతే సైన్యాన్ని ఉపసంహరించామని చెప్పారాయన. కాబూల్ విడిచిపోవడం కంటే మరోదారి లేదని.. మానవ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాలిబన్ల చేతిలో బందీగా మారిన అఫ్ఘానిస్తాన్ విడిచివెళ్లానుకునేవారికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అఫ్ఘానిస్తాన్‌లో భారీగా అవినీతి జరిగిందని.. ఇప్పుటికైనా అఫ్ఘాన్‌లో ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగాలని కోరారు అగ్రరాజ్యాధినేత.

Read More : Afghanistan : మళ్లీ అప్ఘానిస్తాన్ చేరుకున్న బిన్ లాడెన్ సన్నిహితుడు

90 శాతం అమెరికన్లను అక్కడి నుంచి తరలించామని వివరించారు బైడెన్. అమెరికా సెక్రటరీ బ్లింకెన్‌ అఫ్ఘాన్‌లో తాలిబన్లతో ఎప్పటికప్పడు చర్చిస్తూ అక్కడ ఉన్న అమెరికన్ల రక్షణపై చర్యలు తీసుకుంటారన్నారు. మరోవైపు ఉగ్రవాదం వైపు ఉండే వారికి హెచ్చరికలు చేస్తున్నట్టు చెప్పారు బైడెన్‌.  చెప్పినట్టుగానే…డెడ్‌లైన్‌ ఆగస్టు 31లోపే అప్ఘానిస్తాన్‌ను వీడారు అమెరికా సైనికులు. పంజ్‌షీర్ మినహా మిగిలిన అప్ఘాన్ మొత్తం తాలిబన్ల వశమైపోయింది.

Read More : World Bank : అప్ఘానిస్తాన్‌కు నిధులు నిలిపేసిన ప్రపంచ బ్యాంకు

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినప్పటికీ తాలిబన్ల పాలన అనధికారికంగా మొదలయిపోయింది. తాలిబన్ల కబంధహస్తం నుంచి తమకు ఏకైన రక్షణగా భావిస్తున్న కాబూల్ ఎయిర్‌పోర్టు కూడా ముష్కరమూకల ఆధీనంలోకి వెళ్లిపోవడంతో అప్ఘాన్ ప్రజలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల పాలనలో ఉండలేక, దేశం విడిచి వెళ్లే వీలులేక నరకయాతన అనుభవిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు