America Rapper Lil Uzi Vert : అవెంజర్స్ మూవీ సిరిస్ గుర్తున్నాయి కదూ..గుర్తుంటాయి.ఎందుకంటే మర్చిపోయే క్యారెక్టర్స్ కాదు అవెంజర్స్ సిరిస్ లో క్యారెక్టర్స్. ఆ సినిమాల్లో ఓ సిరిస్ లో నుదిటిపై డైమండ్ (అత్యంత శక్తి కలిగిన ఓ శక్తి) ఉన్న ‘Vision’ క్యారెక్టర్ ఒకటి. Vision అంటే దృష్టి. అదిగో అచ్చు Visionలాగా ఓ ర్యాపర్ నుదిటిమీద ఓ పింక్ డైమండ్ ను అమర్చుకున్నాడు. ఆ పింక్ డైమండ్ ఖరీదు 24 మిలియన్లు. మన భారత్ కరెన్సీలో రూ.175 కోట్లు.
అంత ఖరీదైన డెమండ్ ను నుదిటిమీద పెట్టుకున్న అమెరికా ర్యాపర్ ‘లిల్ ఉజీ వెర్ట్’ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు లిల్ ఉజీ వెర్ట్. క్రేజ్ కోసమో అలా నుదిటిమీద పింక్ డైమండ్ అమర్చుకున్నో ఏమోగానీ లిల్ ఉజీ వెర్ట్ పెద్ద చర్చనీయాంశంగా మారిపోయాడు. ర్యాపర్ లిల్ ఉజీ వెర్ట్ పింక్ ను నుదుటి మీద అమర్చుకున్న ఫోటోల్నీ..వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
వామ్మో.. అంత విలువుండే వజ్రాన్ని అక్కడ పెట్టుకోవడం ఎందుకు? చైన్ చేయించుకుని మెడలో లాకెట్‌లా వేసుకోవచ్చుగా అని అనుకోవచ్చు. అలా చేస్తే..వెరైటీ ఏముంటుంది? రోటీన్ కు భిన్నంగా ఉండాలనుకున్నాడేమో ఇలా వెరైటీగా నుదిటిలో పెట్టించేసుకున్నాడు లిల్ ఉజీ వెర్ట్.
ఇంటర్నేషనల్ ర్యాపర్‌గా మాంచి పేరు సంపాదించిన లిల్ ఉజి వెర్ట్కు వచ్చిన ఈ వెరైటీ ఆలోచనతో వైరల్ అయిపోయాడు. 2017 నుంచి పొదుపు చేసిన డబ్బుతో కొన్న ఈ ‘పింక్ డైమండ్’ను నుదిటికి పెట్టించేసుకున్నాడు. దీంతో అతడి నుదిటిపై మూడో కన్ను మొలిచిందా? అన్నట్లుగా ఉందీ పింక్ డైమండ్..లిల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బ్యూటీ ఈజ్ పెయిన్’ అంటూ పోస్ట్ చేసిన వీడియోను చూసి అభిమానులు షాక్ అయ్యారు.
అతడి తలపై పింకు రంగులో మెరుస్తున్న వజ్రాన్ని చూసి.. ‘‘అంత రిస్క్ ఎందుకు? ఒక ఉంగరం చేయించుకుని వేలుకు పెట్టుకుంటే సరిపోతుంది కదా..’’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. అతడికి లిల్ కూడా స్పందిస్తూ..‘‘అది ఒక వేళ పడిపోతే?’’ అంటూ ప్రశ్నించాడు. ఇలా లిల్ నుదిటిమీద పెట్టించుకున్న పింక్ డైమండ్ చర్చనీయాంశంగా మారింది. ఎవరికి తోచినట్లుగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు.కామెంట్స్ చేస్తున్నారు. కాగా లిల్ మీడియాతో మాట్లాడుతూ..‘‘10 నుంచి 11 క్యారట్ల ఈ వజ్రం విలువ.. నా వద్ద ఉన్న కార్లు, నా ఇంటి కంటే ఖరీదైనది’’ అని చెప్పుకొచ్చాడు.
కానీ ఆ పింక్ డైమండ్ కోసం అవెంజర్స్ సినిమాలో థానోస్ లాగా ఎవరైనా అతనికి హాని చేస్తారేమోనని లిల్ అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.