China Protest: కొవిడ్ లాక్‭డౌన్‭పై చైనీయుల చారిత్రక ఆందోళన వృధాయేనా? తగ్గినట్టే తగ్గి కంచెలు బిగుస్తోన్న జిన్‭పింగ్ సర్కార్

చాలా కాలానికి కాని చైనాలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆందోళన రాలేదు. కానీ ఇంతకు తెగించి ఆందోళన చేస్తే ఏం లాభం..? కొవిడ్-19 ఆంక్షలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా, వాటిని మరింత కఠినం చేసింది. వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపించింది. చైనాలో చాలా కాలం తర్వాత కొనసాగిన నిరసనకు జిన్‭పింగ్ ప్రభుత్వం కదిలినట్లే కనిపించింది.

China Protest: మన దేశంతో పోల్చుకుంటే చైనా జన జీవనం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతనైనా చాలా సులువుగా తెలిపే అవకాశం ఉంటుంది. కానీ, చైనాలో పరిస్థితి అలా ఉండదు. అక్కడ ప్రజాస్వామ్యం లేకపోవడం ఒకటైతే, పాలనా విధానం మరొకటి. విచిత్రంగా మన దేశంలో కొవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన లాక్‭డౌన్‭పై ప్రజలు అభ్యంతరం చెప్పలేదు. కానీ, చైనాలో అభ్యంతరం తెలిపారు. అభ్యంతరం వరకే ఆగిపోలేదు, ఏకంగా ఆందోళన చేపట్టారు. కొవిడ్ పేరు చెప్పి, తమ హక్కుల్ని లాక్కోవద్దని, తమకు స్వేచ్ఛ కావాలని కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

Poison Experiment On Students : ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు.. విద్యార్థులపై విష ప్రయోగం!

చాలా కాలానికి కాని చైనాలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆందోళన రాలేదు. కానీ ఇంతకు తెగించి ఆందోళన చేస్తే ఏం లాభం..? కొవిడ్-19 ఆంక్షలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా, వాటిని మరింత కఠినం చేసింది. వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపించింది. చైనాలో చాలా కాలం తర్వాత కొనసాగిన నిరసనకు జిన్‭పింగ్ ప్రభుత్వం కదిలినట్లే కనిపించింది. అయితే ఈ ఆందోళనపై వెనక్కి తగ్గితే భవిష్యత్తులో ఎక్కువైపోతాయని అనుకున్నారో ఏమో.. లాక్‭డౌన్‭ను మరింత పటిష్టం చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

MCD Polls: రాజ్యాన్ని గెలిచి రాజధానిలో నెగ్గని బీజేపీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో ఢిల్లీపై మరింత పట్టు సడలింది

2012లో జిన్‭పింగ్ అధికారంలోకి వచ్చిన అనంతరం నాటి నుంచి కొవిడ్-19 లాక్‭డౌన్‭పై చేసిన ఆందోళనే అతి పెద్దది. ఇప్పటికే చైనాలోని నగరాలు కఠినమైన ఆంక్షలతో కొనసాగుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయితే పోలీసుల ప్రయోగంతో ఈ నిరసనలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కానీ, బుధవారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ ఊపందుకుంటాయో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు