China Covid Cases Report : ఒక్కరోజే 16,400 కరోనా కేసులు.. చైనాలో మళ్లీ కొవిడ్ కల్లోలం.. లాక్‌డౌన్ విధించినా..

కరోనావైరస్ మహమ్మారి చైనాను వెంటాడుతోంది. ఆ దేశంలో వైరస్‌ ఉధృతి అంతకంతకూ పెరుగుతూ నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు..(China Covid Cases Report)

China Covid Cases Report : యావత్ ప్రపంచం కరోనా ఆంక్షలు సడలిస్తుంటే.. చైనాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కరోనావైరస్ మహమ్మారి చైనాను వెంటాడుతోంది. ఆ దేశంలో వైరస్‌ ఉధృతి అంతకంతకూ పెరుగుతూ నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంతగా తాజాగా అత్యధికంగా 16వేల 400 కొత్త కేసులు వెలుగుచూశాయి. కొత్త కేసుల్లో 13వేల కేసులు (దాదాపు 80 శాతం) ఆర్థిక రాజధాని షాంఘై నగరం నుంచే నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. తొమ్మిది రోజుల క్రితం లాక్‌డౌన్‌ విధించినప్పటితో పోలిస్తే.. తాజా కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా పెరగడం గమనార్హం.

షాంఘైలో లాక్‌డౌన్‌ విధించి భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో కొత్త కేసులు అంతే స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. కేసుల పెరుగుదలతో లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆర్థిక రాజధానిలో కఠిన ఆంక్షలు విధిస్తున్నామని, దాదాపు 2.5 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. వైరస్ ఉధృతి తగ్గేవరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గ్వాంగ్‌డాంగ్, జిలిన్, షాన్‌డాంగ్ వంటి భారీ జనాభా గల ప్రావిన్సుల్లో 390 ప్రాంతాలను సాధారణ లేదా హై రిస్క్ ప్రాంతాలుగా ప్రకటించారు.(China Covid Cases Report)

XE recombinants virus : కరోనా కొత్త వైరస్ ‘XE Omicron’ లక్షణాలివే..!

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇంటి బయటకు రావడానికి కూడా అనుమతి లేదు. దీంతో వారు ఆహారం, తాగునీటిని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించుకొంటున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు ఆన్‌లైన్‌లోనే ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

షాంఘైలో కరోనా ఉధృతిని అడ్డుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. 2వేల మంది సైనిక వైద్య సిబ్బంది సహా 10వేల మంది ఆరోగ్య కార్యకర్తలను ఆ నగరానికి పంపింది. రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులు చైనా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. చైనీయులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదా? అని వర్రీ అవుతున్నారు.

China Covid : చైనాలో కరోనా విలయతాండవం.. కొత్తగా 16వేలకు పైగా కేసులు, ఇదే అత్యధికం..!

ఇది ఇలా ఉంటే.. కరోనావైరస్ మహమ్మారి మప్పు ఇంకా పోలేదు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తించిన ఒమిక్రాన్ వేరియంట్.. సరికొత్త రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ స్ట్రెయిన్స్ (BA1, BA2) కాంబినేషన్‌తో ‘XE Omicron’ అనే పేరుతో ఈ కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త వేరియంట్ గుర్తించింది. ఈ వైరస్ వ్యాప్తి కరోనా థర్డ్ వేవ్ కన్నా 10 రెట్లు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ కొత్త వైరస్‌కు సంబంధించి ఇప్పటికే 600కుపైగా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. కొత్త వేరియంట్‌ యూకేలో జనవరి 19న తొలిసారిగా బయటపడింది.

ట్రెండింగ్ వార్తలు