#LetHerLearn: మహిళలకు విద్య నిషేధం.. తరగతులు బాయ్‭కాట్ చేసి మద్దతు తెలిపిన అఫ్గాన్‭ మగ విద్యార్థులు

యూనివర్సిటీలోకి అనుమతి ఇవ్వడం వల్ల.. ఆడ, మగ ఒకే దగ్గరికి వస్తున్నారని, ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా ఉండడంతో దీన్ని నిరోధించడానికే ఈ కొత్త ఆదేశాలని ఆయన పేర్కొన్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆదేశం అమలులో ఉంటుందని తాలిబన్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నిదా మహ్మద్ నదిం గురువారం ప్రకటించారు. మంత్రి నిదా మహ్మద్ నదిం చేసిన ప్రకటన అనంతరం అఫ్గనిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి

#LetHerLearn: సాధారణంగా గల్ఫ్ దేశాల్లో మహిళా సమస్యలపై పురుషుల నుంచి పెద్దగా మద్దతు లభించదు. కానీ ఇరాన్ దేశంలో ఇటీవలి హిజాబ్ వివాదం విషయంలో మాత్రం మగవారి నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇక తాజా అఫ్గానిస్తాన్ దేశంలో కూడా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దేశంలోని మహిళలకు ఉన్నత విద్యను నిరాకరించడంపై బాలికలు, మహిళలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వారికి మద్దతుగా మగవారి నుంచి కూడా మద్దతు లభించింది. అఫ్గాన్‭లోని తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం తరగతులు బాయ్‭కాట్ చేసి మగ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

Rahul Gandhi: చైనా, పాక్ ఒక్కటయ్యాయి, ఒకవేళ యుద్ధం వస్తే.. రాహుల్ గాంధీ

మహిళలకు చదువు అవసరమని, వారిని ఉన్నత విద్యకు అనుమతించేంత వరకు తాము తరగతులకు హాజరుకాబోమని నిరసనకు దిగిన మగ విద్యార్థులు తెలిపినట్లు అఫ్గాన్‭కు చెందిన టోలో న్యూస్ మీడియా తెలిపింది. టోలో న్యూస్ ప్రకారం.. ముజాముల్ అనే విద్యార్థి స్పందిస్తూ ‘‘మా సోరదిమనులకు యూనివర్సిటీ తలుపులు మూయడం సబబు కాదు. వారిని విద్యకు అనుమించేంత వరకు మేము తరగతులకు హాజరుకాము. అవసరమైతే మా విద్యా సంవత్సరాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

Bihar: భూ తగాదా.. ఐదుగురు మహిళలపై కిరాతకంగా కాల్పులు జరిపిన ఓ వ్యక్తి

ఇక ఈ విషయమై అఫ్గాన్ మహిళలు ‘ఆమె చదువుకోనివ్వండి’ అనే నినాదంతో ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలోకి అనుమతి ఇవ్వడం వల్ల.. ఆడ, మగ ఒకే దగ్గరికి వస్తున్నారని, ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా ఉండడంతో దీన్ని నిరోధించడానికే ఈ కొత్త ఆదేశాలని ఆయన పేర్కొన్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆదేశం అమలులో ఉంటుందని తాలిబన్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నిదా మహ్మద్ నదిం గురువారం ప్రకటించారు. మంత్రి నిదా మహ్మద్ నదిం చేసిన ప్రకటన అనంతరం అఫ్గనిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. మహిళలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే రెండవ తరగతి పౌరులుగా ఉన్న తమను ప్రభుత్వం మరింత వెనుకబాటుకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను చదువుకు, జ్ణానానికి దూరం చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫ్ఘాన్ మహిళలు చేస్తున్న ఈ నిరసనకు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా మద్దతు లభిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు