Twitter: ట్విటర్‌లో సాంకేతిక సమస్య.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్‌

ట్విటర్ డౌన్ కావడంతో అందరూ ఇన్‌స్టాగ్రామ్, త్రెడ్స్ లోకి పరుగులు తీస్తున్నారని మరికొందరు మీమ్స్ సృష్టించారు.

X down: మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విటర్‌)లో శుక్రవారం సాయంత్రం కాసేపు సాంకేతిక సమస్య తలెత్తింది. భారత్‌లోనూ చాలా మంది ట్విటర్ యూజర్లకు కూడా ఈ సమస్య ఎదురైంది. ట్విటర్ పేజీలను రిఫ్రెష్ చేసేటప్పుడు, కొత్త కంటెంట్‌ను పోస్ట్ చేసేటప్పుడు అది పనిచేయలేదని చాలా మంది యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.

డౌన్‌డెటెక్టర్ వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. భారతీయ కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7.31 గంటలకు ట్విటర్‌లో ఔటేజ్ 566కి చేరింది. ట్విటర్ అధికారిక యాప్ ఆ సమయంలో పనిచేయలేదని చాలా మంది యూజర్లు చెప్పారు. ట్విటర్ కొద్దిసేపు పనిచేయకపోవడంతో దాని యజమాని ఎలాన్ మస్క్ పై యూజర్లు సెటైర్లు వేస్తూ పోస్టులు చేశారు.

ఎలాన్ మస్క్ కాస్త ట్విటర్ ను కూడా పట్టించుకోవాలని, ఆయనకున్న ఇతర కంపెనీలపైనే దృష్టి పెట్టడం సరికాదని కొందరు నెటిజన్లు చురకలు అంటించారు. ట్విటర్ డౌన్ కావడంతో అందరూ ఇన్‌స్టాగ్రామ్, త్రెడ్స్ లోకి పరుగులు తీస్తున్నారని మరికొందరు మీమ్స్ సృష్టించారు.

ట్రెండింగ్ వార్తలు