Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన

పాకిస్థాన్‌లో వరదలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంతో ఆ దేశం ప్రపంచ దేశాల సాయాన్ని అర్థిస్తోంది. వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ తమ అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నట్లు పేర్కొంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సహకారం అందించాలని కోరింది. పాక్ వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 1,200 దాటింది. వారిలో చిన్నారులు 441 మంది ఉన్నారు. పాక్ లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం దాదాపు ఐదు లక్షల మందికిని పునరావాస శిబిరాలకు తరలించారు.

Pakistan floods: పాకిస్థాన్‌లో వరదలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంతో ఆ దేశం ప్రపంచ దేశాల సాయాన్ని అర్థిస్తోంది. వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ తమ అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నట్లు పేర్కొంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సహకారం అందించాలని కోరింది. పాక్ వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 1,200 దాటింది. వారిలో చిన్నారులు 441 మంది ఉన్నారు. పాక్ లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం దాదాపు ఐదు లక్షల మందికిని పునరావాస శిబిరాలకు తరలించారు.

పాకిస్థాన్ కు ఐక్యరాజ్య సమితి రూ.1,275 కోట్ల సాయం ప్రకటించింది. అలాగే, అమెరికా రూ.239 కోట్లు అందించనుంది. అయితే, తమ దేశానికి ప్రపంచ దేశాల నుంచి మరింత సాయం కావాలని పాకిస్థాన్ కోరింది. తమ దేశంలోని 3.3 కోట్ల మంది వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే తగిన సాయం అందాల్సి ఉందని పాకిస్థాన్ మంత్రి అహ్సన్ ఇక్బాల్ అన్నారు.

కాగా, వరదలకు పాక్ లోని చాలా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్ళు, పంటలు కొట్టుకుపోయాయి. తాము 147 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని, దాదాపు 50,000 మందికి వాటిలోకి తరలించి, ఆహారం అందిస్తున్నామని పాకిస్థాన్ ఆర్మీ చెప్పింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొంది.

BiggBoss 6 : నేడే ఆట మొదలు.. ఈ సారి బిగ్‌బాస్‌ లో ఉండేది వీళ్లేనా..?

ట్రెండింగ్ వార్తలు