IPL 2024 : వివాదంగా మారిన సంజు శాంసన్ ఔట్.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్న మాజీ క్రికెటర్లు.. అసలేం జరిగిందంటే?

థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తితోనే సంజూ శాంసన్ మైదానంను వీడాడు. సంజూ ఔట్ వివాదంపై పలు మాజీ క్రికెటర్లు స్పందించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Sanju Samson Controversial Decision : ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సులు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. అయితే, 86 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ ఔట్ వివాదాస్పదంగా మారింది.

Also Read : IPL 2024 : మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన సంజు శాంసన్

మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 16వ ఓవర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ బౌలింగ్ చేశాడు. సంజు శాంసన్ క్రీజులో ఉన్నాడు. ఆ ఓవర్లో నాలుగో బంతికి సంజూ సిక్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్ వద్ద షాయ్ హోప్ బంతిని అందుకున్నాడు. అయితే, హోప్ క్యాచ్ తీసుకునే సమయంలో అతని పాదం బౌండరీ లైన్ తాడును తాకినట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ హోప్ క్యాచ్ ను తనిఖీ చేయగా.. సంజును ఔట్ గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం తరువాత కూడా సంజు అంపైర్ తో అది ఔట్ కాదని వాదించాడు. కానీ, ఫలితం లేకపోయింది. ఈ వివాదం మైదానంలోనే కాక.. మైదానం వెలుపల కూడా సంజూ ఔట్ ఫై వివాదం చెలరేగింది. ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగర్కర థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోపంగా కనిపించాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాని పార్త్ మాత్రం స్టాండ్స్ నుంచి సంజూ ఔట్.. సంజూ ఔట్ అంటూ సజ్ఞలు చేయడం టీవీ స్క్రీన్ లపై కనిపించింది. చివరికి సంజూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ మైదానంను వీడాడు.

Also Read : Hardik Pandya : ముంబై ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌పై హార్దిక్ పాండ్య‌.. ఆ లెక్క‌లు నాకు తెలియ‌వు భ‌య్యా..

థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తితోనే సంజూ శాంసన్ మైదానంను వీడాడు. సంజూ ఔట్ వివాదంపై పలు మాజీ క్రికెటర్లు స్పందించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్టార్ స్పోర్ట్స్ లో స్పందించారు. సంజూ కొట్టిన క్యాచ్ తీసుకునేటప్పుడు హోప్ కాలు తాడును తాకినట్లు కనిపించిందని, థర్డ్ అంపైర్ ఎలా ఔట్ ఇస్తాడని ప్రశ్నించారు. ఇదిలాఉంటే.. ఔట్ పై సంజూ శాంసన్ అసంతృప్తి వ్యక్తం చేసినందుకు అతని మ్యాచ్ ఫీజులో ఐపీఎల్ యాజమాన్యం 30శాతం జరిమానా విధించింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు