Russia-Ukraine War Day-2, Important Points : అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి.. యుక్రెయిన్‌ ఆర్మీకి పుతిన్‌ పిలుపు

యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ నాయకత్వాన్ని తొలగించి వెంటనే మీ చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవాలని సూచించారు.

Russia-Ukraine War Day-2 Live Updates : రష్యా-యుక్రెయిన్ యుద్ధం రెండోరోజు భీకరంగా కొనసాగింది. రాజధాని కీవ్ ను రష్యా బలగాలు దాదాపుగా స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా, నాటో.. రష్యాకు భయపడ్డాయని.. తమను ఒంటరి చేశాయని ఆవేదనగా చెప్పారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ. మరోవైపు.. స్వచ్చందంగా.. జనం ఆయుధాలు పట్టి రణరంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొంది.

ఉక్రెయిన్ లోని కీలక న్యూక్లియర్ ప్లాంట్ చెర్నోబిల్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. తొలిరోజు రష్యా 203 బాంబు దాడులు చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. రేడియో ధార్మిక వ్యర్థాల నిల్వలపై రష్యా బాంబులు వేసిందని.. దీంతో రేడియో ధార్మికత స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయిందని తెలిపింది. గతంలో జరిగిన అణు దుర్ఘటన కారణంగా.. ఇప్పటికే చెర్నోబిల్ న్యూక్లియర్ స్థావరాన్ని మూసివేసింది ఉక్రెయిన్. తొలిరోజు 137 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ తెలిపారు. మరోవైపు.. రష్యా తీరుపై అమెరికా ఫైరవుతోంది. యుద్ధాన్ని ఎంచుకున్న వ్లాదిమిర్ పుతిన్ ఆక్రమణదారుడని బైడెన్ ఆరోపించారు. సోవియట్ యూనియన్ ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారనీ.. అమెరికాపై సైబర్ దాడులు జరిపితే ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

యుక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతో.. తమమీద ఆంక్షలు విధించిన దేశాలపై.. రష్యా సీరియస్ గా ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను అమెరికాపైనో.. చైనా, ఇండియాపైనో కూల్చేస్తే తట్టుకోగలరా.. అంటూ ఆ దేశానికి చెందిన అధికారి ట్వీట్లు చేయడం.. సంచలనంగా మారింది. ఇదే సమయంలో.. నేరుగా చర్చలకు సిద్ధమంటూ జెలెన్ స్కీ మరో కీలక ప్రతిపాదనను పుతిన్ ముందుంచారు. అందుకు పుతిన్ కూడా సానుకూలంగా ఉన్నట్టు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీల కథనాల ఆధారంగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు