Ukraine Grandma : ‘నా దేశం యుక్రెయిన్‌ కోసం యుద్ధానికి సిద్ధం’అంటున్న 79 ఏళ్ల బామ్మ..

‘నా దేశం ఉక్రెయిన్‌ కోసం యుద్ధానికి సిద్ధం’అంటున్న 79 ఏళ్ల బామ్మ..చిన్నా పెద్ద తమ దేశాన్ని కాపాడుకోవటానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

Ukrainian 79 Yeas old Grandmother Picks up AK-47 : మనలో మనకు ఎన్నున్నా దేశం సమస్య వస్తే భారతీయులంతా ఒక్కటే అన్నట్లుగా ఉంటాం. అలాగే ఏదేశ ప్రజలైనా అలాగే అనుకుంటారు. మాతదేశానికి ముప్పు ఏర్పడుతుందంటే చిన్నా పెద్ద ఏకమవుతారు. దేశం కోసం పోరాడటానికి ‘మేము సైతం’ అంటూ ముందుకొస్తారు. ప్రస్తుతం యుక్రెయిన్ ప్రజలు కూడా అదే పోరాట పటిమను చూపిస్తున్నారు. చిన్నా పెద్దా..ముసలీ ముతకా అంతా రష్యా మామీదకు వస్తే మా దేశం యుక్రెయిన్ కోసం పోరాడటానికి సిద్ధమంటున్నారు. అలా నేను సైతం అంటోంది యుక్రెయిన్ కు చెందిన 79 ఏళ్ల వృద్ధ మహిళ..

‘‘నేను సైనికుల్లా దృఢమైన సైనికురాలిని కాకపోవచ్చు.. బరువైన ఆయుధాలను మోయలేకపోవచ్చు.. కానీ, నా దేశం కోసం పోరాడతాను..నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడను..నా దేశాన్ని ఓడిపోనివ్వను…నా దేశం కోసం నేను సైతం’’.. అంటోంది ఉక్రెయిన్‌కు చెందిన 79ఏళ్ల బామ్మ వాలెంటినా కోన్‌స్టాంటీనొవాస్కా. ఆమె ఉద్వేగంతో ఆమె పలికే మాటలు వింటే దేశంలో ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.

Russia-Ukraine : ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్

ఈ వృద్ధురాలే కాదు యుక్రెయిన్‌లో నాలుగేళ్ల చిన్నారి కూడా నా దేశం కోసం నేనున్నానంటోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ.. ఎవర్ని కదిలించినా ఇదే భావోద్వేగం కనిపిస్తోంది. రష్యా ఆక్రమణ నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం అక్కడ చిన్నా పెద్దా..ముసలీ ముతకా అంతా కదిలివస్తున్నారు.మేము సైతం పోరాడతామంటున్నారు. యుద్ధం ఎదురైతే ‘మేము సైతం’ అంటూ తుపాకులతో సామాన్యులుకూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య దశాబ్దాల పాటు జరుగుతున్న వివాదం ఇటీవల మరింత ముదిరిన విషయం తెలిసిందే. యుక్రెయిన్‌పై ముప్పేట దాడి చేసేందుకు అన్ని విధాల సిద్ధమైన రష్యా.. సరిహద్దుల్లో లక్షన్నర మంది సైనికులను మోహరించింది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉండటంతో ఉక్రెయిన్‌ సైన్యం సర్వ శక్తులతో సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఆ దేశ ప్రజలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. సామాన్య పౌరులు కూడా ఆయుధాల వాడకంపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకునేవారిలో చిన్నారులు, వృద్ధులు కూడా కదిలివస్తున్నారంటే వారి దేశ భక్తి ఎలాంటిదో ఊహించుకోవచ్చు.

Also read : Russia Ukraine Conflict : రష్యా యుద్ధాన్ని కోరుకోవడం లేదు.. కానీ, దాడికి అవకాశం ఉంది : పుతిన్

తూర్పు ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లో 79 ఏళ్ల వాలెంటినా కూడా ఈ ట్రెయినింగ్‌లో పాల్గొని జాతీయ భద్రతా సిబ్బంది నుంచి ఏకే – 47 తుపాకీని ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ పొందుతున్నారు. ఈ వయస్సులో మీరేం చేయగలరు? అని ఎవరన్నా అంటే ధీటైన మాటలతో తోటివారికిలో కూడా పోరాటపటిమను నింపే వాక్కులు చెబుతున్నారామె. తుపాకీ చేతబట్టి లక్ష్యానికి గురిపెడుతున్న వాలెంటినా ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వయసు కూడా పక్కనబెట్టి దేశం కోసం ముందుకొచ్చిన వాలెంటినాను ఉక్రెయిన్‌ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also read :  Ukraine : యుక్రెయిన్‌‌కు కష్టాలు.. నిన్న యుద్ధం, నేడు సైబర్ దాడులు

దీని గురించి వాలెంటినా మాట్లాడుతూ..‘‘యుద్ధం అంటూ వస్తే నేను నా దేశాన్ని కాపాడుకోవటానికే ముందు అడుగు వేస్తాను. మా దేశాన్ని ఆక్రమించుకోవాలనే దేశంపై కాల్పులు జరిపటానికి సిద్ధంగా ఉన్నాను. నా ఇంటిని, నా పిల్లలను, నా నగరాన్ని నేను రక్షించుకుంటాను. నా దేశాన్ని ఎన్నటికీ ఎవ్వరి కబంధహస్తాకు చిక్కనివ్వను.. వయస్సు రీత్యా నేను బలహీనురాలినే కావొచ్చు. కానీ యుద్ధానికి సిద్ధమే’’ అంటున్నారామె. ఆమె తూటాల్లాంటి మాటతో ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తి రగిలిస్తున్నారు.
ఆమెను చూసి యువత, ఇతర వృద్ధులు సైతం అత్యంత ఉత్సాహంగా ట్రైన్ అవుతున్నారు.తమ భవిష్యత్‌ తరం సమస్యలో చిక్కుకోకూడదంటే తాము యుద్ధం చేయాల్సిందే అంటున్నారు మరో బామ్మ మరియానా జాగ్లో. అటు చిన్న పిల్లలు కూడా ఆయుధాలు చేతబట్టి యుద్ధ శిక్షణ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.

Also read : Ukraine Crisis : యుక్రెయిన్ సంక్షోభం.. మన వంటిల్లు ఇక భారమే.. ఎందుకంటే?

యుక్రెయిన్ లో పరిస్థితి ఇలా ఉంటే..రష్యా వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. యుక్రెయిన్‌పై తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా తాజాగా ప్రకటించడంతో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. సరిహద్దుల్లో సైనిక విన్యాసాల్లో పాల్గొన్న తమ బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ తాజాగా ప్రకటించింది. దీంతో రష్యాసేనలు అక్కడి నుంచి వెనుతిరుగుతున్నాయి.. కానీ యుక్రెయిన్ సరిహద్దుల నుంచి ఎంత మంది సైనికులు వెనక్కి వచ్చేస్తున్నారన్న వివరాలను వెల్లడించలేదు.

అయినా రష్యాను రష్యాను పశ్చిమ దేశాలు నమ్మటంలేదు. ఉక్రెయిన్‌కు ఇంకా దాడి ప్రమాదం పొంచే ఉందంటున్నారు. సరిహద్దుల్లో ఇంకా యుద్ధమేఘాలు పూర్తిగా తొలగి పోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ పేర్కొన్నారు అంటే ఇక చెప్పేదేముంది? రష్యా దాడి చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని బైడెన్ తెలిపారు. అంటే ఇంకా యుక్రెయిన్ కు పూర్తిగా రష్యా ముప్పు తొలగిపోలేదనే చెప్పాలి. కానీ పరిస్థితులు చేయిదాటి యుద్ధమంటూ వస్తే ‘మేము సైతం’అంటున్నారు యుక్రెయిన్ ప్రజలు..

ట్రెండింగ్ వార్తలు