Queen Eizabeth jewelry : ఎలిజబెత్ మరణం తరువాత .. దోచుకున్న సొమ్ము ఇవ్వాలని డిమాండ్లు ..కోహినూర్‌ కోసం భారత్‌ .. కల్లినన్‌ వజ్రం కోసం దక్షిణాఫ్రికా డిమాండ్స్

ఎలిజబెత్ మరణం తరువాత ..మా నుంచి దోచుకుపోయిన సొమ్మును మర్యాదగా తిరిగి ఇవ్వండి అంటూ అన్నీ దేశాల ప్రజలను బ్రిటన్‌ను నిలదీస్తున్నారు. ..కోహినూర్‌ కోసం భారత్‌ .. కల్లినన్‌ వజ్రం కోసం దక్షిణాఫ్రికా ఇలా ఆయా దేశాలు తమ దేశం నుంచి దోచుకుపోయిన సొమ్మును తిరిగి ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

Queen Eizabeth jewelry : బ్రిటన్ రాణి ఎలిజబెత్ మృతి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్ తమ పాలనతో దోచుకున్నసొమ్మును తిరిగి ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.  మా నుంచి దోచుకుపోయిన సొమ్మును మర్యాదగా తిరిగి ఇవ్వండి అంటూ అన్నీ దేశాల ప్రజలను బ్రిటన్‌ను నిలదీస్తున్నారు. ఇంతకాలం ఇతరుల సొమ్ముతో దర్జా వెలగబెట్టింది చాలు.. ఇకనైనా మా సంపద మాకు తిరిగిచ్చేయండి అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ జాబితాలో మొన్నటి వరకు ఇండియా పేరొక్కటే వినిపించింది. ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా కూడా చేరింది. ఆ దేశానికి చెందిన విలువైన వజ్రం కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి.

క్వీన్ ఎలిజబెత్-2 మృతికి ప్రపంచ దేశాలన్నీ సంతాపం తెలిపాయి. అదే సమయంలో గతంలో బ్రిటన్‌ దోచుకెళ్లిన అత్యంత విలువైన సంపద తిరిగివ్వాలన్న డిమాండ్‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఫోర్బ్స్ అంచనా ప్రకారం.. రాయల్ ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువ 2 వేల 800 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో అయితే దాదాపు 2 లక్షల 20 వేల కోట్ల రూపాయలు. ఇదంతా వారి కష్టార్జితం అనుకుంటే పొరపాటే..! వలస పాలన పేరుతో ఎన్నో దేశాల నుంచి అత్యంత విలువైన సంపదను దోచుకుపోయారు. ఎలిజబెత్‌ – 2 ధరించే ఆభరణాలు విలువ కట్టలేనివి. ప్రపంచంలో అలాంటి సంపద మరెక్కడా లేదు. అందులో మన సంపదతో పాటు ఇతర దేశాలకు చెందిన సంపద కూడా ఉంది. ఇండియా మొదలుకొని దక్షిణాఫ్రికా, కెన్యా, నైజీరియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్‌, ఫిజీ, బార్బడోస్‌ నుంచి బ్రిటన్‌ వలస పాలకులు వజ్ర వైడూర్యాలను దోచుకుపోయారు. ఎలిజబెత్‌ బతికున్నప్పుడు ధరించే కిరీటం మొదలుకొని ఆమె మెడలో వేసుకునే వజ్రాల హారాలు, చేతిలోని రాజదండంలో పొదిగిన విలువైన వజ్రాలు.. ఇవన్నీ ఇతర దేశాలకు చెందినవే..! ఇప్పుడు ఆమె మరణించడంతో ఆ సంపద మర్యాదగా తిరిగివ్వండి అంటూ డిమాండ్లు తెరపైకొస్తున్నాయి.

Queen Elizabeth : ఫ్యాషన్ ఐకాన్‌ క్వీన్ ఎలిజబెత్ .. ప్రపంచంలోనే అతి విలువైన ఆభరణాలు ఆమె సొంతం

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్-2 మరణం తరువాత.. రాజ కుటుంబం ఆధీనంలో ఉన్న వజ్రాలను తిరిగి ఇచ్చేయాలంటూ పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ కోహినూర్‌ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ భారీగా ట్రెండ్‌ అయ్యింది. ఇప్పుడు అలా డిమాండ్‌ చేసే దేశాల లిస్టులోకి దక్షిణాఫ్రికా చేరింది. ఆఫ్రికా ఖండంలోనే ప్రసిద్ధి చెందిన కల్లినన్‌ అనే వజ్రాన్ని తమకు తిరిగి ఇచ్చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వజ్రం సుమారు 3,106 క్యారెట్ల బరువు ఉంటుంది. వీటిలో 500 క్యారెట్‌లను కత్తిరించి గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా డైమండ్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ వజ్రం రాణికి చెందిన రాజదండంపై పొదిగి ఉంది. కల్లినన్‌ వజ్రం అత్యంత విలువైనదే కాకుండా చారిత్రత్మకంగా చాలా ప్రసిద్ధి చెందినది. 1600 ఏళ్ల నాటి ఈ వజ్రాన్ని వలస పాలకులు బ్రిటిష్‌ రాజకుటుంబానికి ఇచ్చారు. తమ దేశ ఖనిజాలతోనూ, ప్రజల సొమ్ముతోనూ బ్రిటన్‌ కులుకుతోందని దక్షిణాఫ్రికా నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన‌ చేసిన నిర్వాకానికి పరిహారం చెల్లించాల్సిందేనని… దొంగిలించిన మొత్తం సొమ్మును ఇచ్చేయాలంటూ సోషల్‌ మీడియాలో డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు చేంజ్‌ డాట్ ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌లో పిటిషన్‌ కూడా వేశారు.

Queen Elizabeth : క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు ఆ మూడు దేశాలకు అందని ఆహ్వానం .. కారణం చాలా కీలకమే

కోహినూర్‌ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే పిలుపు నేపథ్యంలో.. ఈజిప్టు నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. రోసెట్టా స్టోన్ ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. ఇది ఈజిప్ట్ నుంచి బ్రిటీషర్లు ఎత్తుకుపోయారు. ఈ స్టోన్ క్రీస్తు పూర్వం 196 నాటిది. 1800 సంవత్సరంలో ఫ్రాన్స్‌తో జరిగిన యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తరువాత ఈ ప్రసిద్ధ రాయిని స్వాధీనం చేసుకుంది. దాన్ని ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని ఈజిప్ట్‌ నుంచి డిమాండ్‌లు మొదలయ్యాయి. అలాగే టిప్పు సుల్తాన్ ఉంగరాన్ని 1799లో బ్రిటీష్ వలస పాలకులు లాక్కెళ్లారు. బ్రిటీషర్లతో చేసిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తరువాత అతని మృతదేహం నుండి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. 1803లో, లార్డ్ ఎల్గిన్ గ్రీస్‌లోని పార్థినాన్ శిథిల గోడల నుండి అరుదైన రాళ్లను తీసి, వాటిని లండన్‌కు రవాణా చేశాడు. 1925 నుంచి గ్రీస్ తమ అమూల్యమైన మార్బుల్స్‌ని తిరిగి ఇవ్వాలని బ్రిటన్‌ను కోరుతోంది. ఆ రాళ్లను బ్రిటీష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడు ఎలిజబెత్ 2 మృతితో మళ్లీ గ్రీసు నుంచి డిమాండ్‌లు బలంగా వినిపిస్తున్నాయి.

Queen Elizabeth-2: క్వీన్ ఎలిజబెత్ -2ను ఖననంచేసే స్థలం ఎక్కడ ఉంది? దాని ప్రాముఖ్యత ఏమిటి?.. ఇక్కడ ఎన్నో శుభకార్యాలు కూడా..

ఇటు దోచుకున్న సంపదను తిరిగివ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతుంటే.. అటు బ్రిటన్‌ రాచరిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాచరికాన్ని రద్దు చేయాలని డిమాండ్లు చేస్తూ జనం రోడ్డెక్కుతున్నారు. రాచరికాన్ని వ్యతిరేకిస్తూ.. రాజకుటుంబాన్ని వెక్కిరిస్తూ.. నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నినాదాలు చేస్తున్నారు. ఎలిజబెత్‌ రాణి 2 మరణంతో.. బ్రిటిష్‌ రాజరికంపై దాడి మొదలైంది. ఒకవైపు మహారాణి మరణానికి వేలమంది సంతాపం తెలుపుతుంటే.. మరోవైపు రాచరికాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాధిపతిగా పదవి చేపట్టిన ప్రిన్స్‌ ఛార్లెస్‌ను రాజుగా గుర్తించటానికి నిరాకరిస్తూ వీధుల్లో.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా నాట్‌ మై కింగ్ అనే హ్యాష్‌ట్యాగ్ కనిపిస్తోంది‌. రాచరికం అనేది అగౌరవప్రదమైంది.. ఎవరైనా పుట్టుకతోనే పాలకులై పోయే పద్ధతిని తాను అంగీకరించనంటూ.. ప్రస్తుత ప్రధాని ట్రస్‌ 30 సంవత్సరాల కిందట మాట్లాడిన వీడియోను బయటకు తీసి మరి ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు. ఇలా క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత బ్రిటన్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు