Scotland : అందాల దీవుల్లో నివసిస్తే..రూ. 48 లక్షలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం

ఎటు చూసినా పచ్చదనం..ప్రకృతిమాత కొలువు తీరిందా?అనంతే అందాల దీవులు అవి..ఆ అందాల దీవుల్లో నివసిస్తే రూ. 48 లక్షలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.

Scotland : ఈ ట్రాఫిక్‌తో పడలేకపోతున్నారా? సిటీ లైఫ్ బోర్ కొట్టేసిందా? ఎక్కడికైనా దూరంగా వెళ్లాలనిపిస్తుందా? ఐతే.. మీలాంటి వాళ్లకోసమే ఈ న్యూస్. న్యూస్ మాత్రమే కాదు.. బంపర్ ఆఫర్. స్కాట్లాండ్ ప్రభుత్వం.. తమ దగ్గరున్న దీవులకొచ్చేస్తే.. 48 లక్షలు ఊరికే అలా ఇచ్చేస్తోంది. కొందరు.. జీవితాంతం కష్టపడినా సంపాదించలేని.. అమౌంట్ అది. ఆ ఐల్యాండ్స్‌కి వెళ్లేవారికి.. డబ్బులెందుకిస్తున్నారు? అక్కడికి వెళ్లినవారు.. ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు? స్కాట్లాండ్ గవర్నమెంట్ ఇలాంటి ఆఫర్ ఎందుకు ప్రకటించింది? దీని వల్ల.. ఆ దేశానికొచ్చే లాభమేంటి?

చాలా మందికి తామున్న ప్రదేశం నచ్చదు. ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్.. ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. ఏదైనా.. పీస్‌ఫుల్ ప్లేస్‌లో నివసించాలనుకుంటారు. అచ్చం.. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశాల్లాంటివన్నమాట. ఈ.. టైపులో ఆలోచించే వాళ్లందరికి.. యూరప్‌లోని స్కాట్లాండ్.. రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్‌కమ్ చెబుతోంది. సిటీ లైఫ్ వదిలేసి.. ఏ గోలా లేని.. ప్రశాంతమైన వాతావరణం కలిగిన.. ప్రాంతానికి రమ్మని చెబుతోంది. పక్షుల కిలకిలు, చిరుగాలులు, స్వచ్ఛమైన వాతావరణంలో జీవించమని చెబుతోంది స్కాట్లాండ్ ప్రభుత్వం. అంతేకాదు.. అక్కడికి వెళ్లి జీవించేవారికి.. గవర్నమెంటే.. 50 వేల పౌండ్లు ఇస్తుంది. అంటే.. మన కరెన్సీలో 48 లక్షలకు పైమాటే. ఒక్కరే కాదు.. ఫ్యామిలీతో సహా వెళ్లిపోవచ్చు.

ఇలా.. డబ్బులిచ్చిన మరీ స్వాగతం పలకడం వెనుక ఓ రీజన్ ఉంది. స్కాట్లాండ్‌లోని కొన్ని దీవుల్లో.. మనుషుల సంఖ్య బాగా తగ్గిపోయింది. లైక్స్ ఆఫ్ ఆర్క్‌నీ, ఐజిల్ ఆఫ్ స్కై ఐలాండ్స్‌కి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను రమ్మని స్వాగతం పలుకుతోంది స్కాట్లాండ్ ప్రభుత్వం. 2026 వరకు.. వందమందికి 48 లక్షల చొప్పున ఇస్తామని కూడా ప్రకటించింది. ఇప్పటికే వందకు పైగా అప్లికేషన్స్ వచ్చేశాయ్. వాటిలో.. సౌత్ అమెరికా నుంచి వచ్చిందే.. అతి దూరపు అప్లికేషన్ అని తెలిపారు. ఈ అప్లికేషన్స్ పరిశీలించి.. ఎవరికి డబ్బులివ్వాలన్నది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది.

వంద మంది లిమిట్ అంటే.. మన దేశంతో పోలిస్తే చాలా తక్కువ. ఇక్కడ వంద మందికి అంటే.. వంద కుటుంబాల కింద లెక్క. ఆ కుటుంబాలు వస్తే.. ఆటోమేటిక్‌గా ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు పెరిగి.. క్రమంగా మళ్లీ జనాభా సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎందుకంటే.. స్కాట్లాండ్ జనాభా కూడా మరీ తక్కువ. సో.. అక్కడికి వంద మంది రావడమే గొప్ప. ప్రస్తుతం.. ఆ దేశ జనాభా 54 లక్షల మంది మాత్రమే. ఒక్క హైదరాబాద్‌లో దానికి డబుల్ ఉంటారు.

ప్రస్తుతం.. చాలా సంపన్న దేశాల్లో జనాభా సంఖ్య తగ్గిపోవడమనే సమస్య వేధిస్తోంది. దాంతో.. మా దగ్గరికొచ్చేయండి బాబూ అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయ్. అయినా.. అక్కడికి వెళ్లే వాళ్లు కనిపించడం లేదు. బయటి దేశాల నుంచి పది మంది వెళితే.. అక్కడున్న వారు 11 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ప్రపంచంలోని అందమైన దీవుల్లో.. స్కాట్లాండ్‌‌లోనివి కూడా ఉన్నప్పటికీ.. ఇక్కడ స్థిరంగా నివసించే వారి కౌంట్ బాగా తగ్గిపోయింది. ఇదే.. ప్రభుత్వానికి సమస్యగా మారింది. అందువల్ల.. స్కాట్లాండ్ ప్రభుత్వం నేషనల్ ఐలాండ్స్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందుకోసం.. అగ్రిమెంట్ చేసుకొని మరీ డబ్బులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఆ డబ్బుతో.. ఇల్లు కొనుక్కోవాలి. వ్యాపారం చేయాలి. ఈ రెండూ ఇష్టం లేని వారు.. సుదీర్ఘ కాలం అక్కడే ఉంటామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి.

విజువల్ చూస్తున్నారుగా.. ఎంత బ్యూటీఫుల్‌గా ఉందో. ఇలాంటి.. దీవులకు వెళ్లేందుకు ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. కానీ.. జీవితాంతం అక్కడే ఉండిపోవాలనే కండీషనే సమస్యగా మారింది. అంతెందుకు.. ఎంత దూరం వెళ్లినా.. తిరిగి మనింటికి వచ్చేయకపోతే.. మనం తట్టుకోలేం. అలాంటిది.. ఇండియాని వదిలి శాశ్వతంగా స్కాట్లాండ్‌లో ఉండాలనుకునేవాళ్లు ఎందరుంటారు? ఎప్పటికైనా.. భారతగడ్డకు తిరిగొచ్చేయాలనే అనుకుంటాం. కానీ.. స్కాట్లాండ్ గవర్నమెంట్ మన సెంటిమెంట్‌లను పట్టించుకోదు. తిరిగి వచ్చేస్తానంటే ఒప్పుకోదు.

ఒక్కసారి వస్తే.. స్కాట్లాండ్ దీవుల్లోనే శాశ్వతంగా ఉండాలని.. అక్కడి ప్రభుత్వం క్లియర్‌గా చెబుతోంది. అయినా సరే.. చాలా మందికి ఈ స్కీమ్ నచ్చింది. అయితే.. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. మన కరెన్సీలో.. వాళ్లిచ్చేది 48 లక్షలు. అమౌంట్.. టెంప్టింగ్‌గానే ఉంది. ఉంటుంది. కానీ.. స్కాట్లాండ్ కరెన్సీలో వాళ్లిచ్చేది.. జస్ట్ 50 వేల పౌండ్లు మాత్రమే. ఆ కొద్ది డబ్బుతో.. అక్కడ జీవించడం చాలా కష్టం. అక్కడేం కొనాలన్నా.. పౌండ్లు చెల్లించాల్సిందే. అక్కడికి వెళ్లాక.. ఏదైనా పని వెతుక్కోవాలి. డబ్బు సంపాదించే మార్గం చూసుకోవాలి. లేకపోతే.. ఆ దీవుల్లో ఏ చెట్టు కిందో.. పుట్ట చాటునో నివసించాల్సి వస్తుంది. ఆలోచించుకోండి మరి..

ట్రెండింగ్ వార్తలు